Minister Harish Rao| కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీల‌తో జాగ్ర‌త్త‌: మంత్రి హ‌రీష్‌రావు

Minister Harish Rao ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు.. మెదక్ లో ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మా రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండగను అత్యంత భక్తి శ్రద్ధలతో, పవిత్రంగా జరుపుకుంటున్నారని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) అన్నారు. రంజాన్ పండుగ వేడుకలు మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లీం […]

  • Publish Date - April 22, 2023 / 02:11 AM IST

Minister Harish Rao

  • ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు..
  • మెదక్ లో ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మా రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండగను అత్యంత భక్తి శ్రద్ధలతో, పవిత్రంగా జరుపుకుంటున్నారని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) అన్నారు. రంజాన్ పండుగ వేడుకలు మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లీం మైనార్టీ సోదరులు జరుపుకున్నారు.ఈద్గా,మజీద్ ల వద్ద ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

మెదక్ లోని నవాబ్ పేట ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి లు పాల్గొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సూఫీ మసీదు ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులతో అలై బలై తీసుకుని అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి హ‌రీష్‌రావు(Minister Harish Rao) మాట్లాడుతూ అల్లా దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలని మంత్రి ఆకాంక్షించారు. ఆయన మాట్లడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకుంటున్నార‌ని అన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.

Padi Kaushik Reddy: ఈటల, రేవంత్ ఇద్దరు తోడు దొంగలే.. IT కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తా: ప్రభుత్వ విప్‌ కౌశిక్ రెడ్డి

అన్ని వర్గాల్లో కుల మతాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి జరుగుతున్నద‌ని స్ప‌ష్టం చేశారు. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్ల నుంచి అందరూ అన్నదమ్ముళ్ల వ‌లె పండుగలు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Sirisilla | రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు.. NMC గ్రీన్ సిగ్నల్