Minister Harish Rao
విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి: గజ్వేల్ అభివృద్ధి గజమాల లాందని రాష్ట్ర ఆర్థిక, వైద్యా, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు (Minister Harish Rao) అభిప్రాయ పడ్డారు.
గజ్వేల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాకముందు సిద్ధిపేటలో ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆనాడు రైతులు, చేనేత కార్మికులు చనిపోతే పక్క రాష్టల నుండి విలేకరులు వచ్చి వార్తలు రాస్తుండేనని గుర్తు చేశారు.
60 ఏళ్ళు ఎనకకు ఉన్న గజ్వేల్ ను 60 ఏళ్ళు ముందుకు తీసుకుపోయిందన్నారు. గుండె మీద చేయివేసుకుని గజ్వేల్ అభివృద్ధి చెప్పండని, ఎవరైనా గజ్వేల్ కు ఏం చేసిండ్రని అడిగితే మన ముఖ్యమంత్రి అన్నీ చేసిండని చెప్పాలని పిలుపునిచ్చారు.
మునుపు గణేష్ నిమర్జనాలు, బతుకమ్మ పండుగలు వస్తే ఏ చెరువులో వేయాలో తెల్వక పోతుండేనని, గజ్వేల్ కు మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక రింగు రోడ్డు, పార్కులు, రైల్వేస్టేషన్, డ్యాములు తెచ్చారన్నారు. ఒక్కటే చెబుతున్న అందరం కలిసి రానున్న రోజులలో మన బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.
గులాబీ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గులాం గిరి చేస్తాం
గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గులాం గిరి చేస్తాం తప్ప ఢిల్లీ పెద్దలకు కాదని మంత్రి హరీష్‌రావు(Minister Harish Rao) కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను కేంద్ర ప్రభుత్వాలు నకలు కొడుతున్నాయని ఎద్దెవా చేశారు.
దేశంలో మార్పు కోసం మన కేసీఆర్ బయలు దేరిండు. మన నినాదం ఒక్కటే రైతు నినాదమన్నారు. రాష్టంలో నాకు తెలిసి పార్టీలను రెండు పర్యాయాలు నిల బెట్టిన వారు ఒకరు ఎన్టీఆర్ మరొకరు కేసీఆర్ నని మంత్రి హరీష్‌రావు చెప్పుకొచ్చారు. నిజాలను ఎప్పుడూ ప్రజల ముందు పెట్టాలని ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.