Harish Rao | కులవృత్తులను ప్రోత్సహించేందుకే బీసీ బంధు: మంత్రి హరీశ్ రావు
Harish Rao | గజ్వేల్ బీసీ బంధు పంపిణీలో మంత్రి హరీశ్ రావు గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా మార్చిన సీఎం కేసీఆర్ విధాత, మెదక్ బ్యూరో: కుల వృత్తులకు (caste workers) ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ అందిస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ బంధు పథకం సహాయ చెక్కులను మంత్రి […]

Harish Rao |
- గజ్వేల్ బీసీ బంధు పంపిణీలో మంత్రి హరీశ్ రావు
- గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా మార్చిన సీఎం కేసీఆర్
విధాత, మెదక్ బ్యూరో: కుల వృత్తులకు (caste workers) ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ అందిస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ బంధు పథకం సహాయ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) మాట్లాడుతూ వృత్తిని నమ్ముకుని ఆధారపడ్డ కులాలకు ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించడమే బీసీ బంధు పథకం లక్ష్యమన్నారు. గతంలో ఇలాంటి పథకాలున్నప్పటికి అది అప్పుకింద ఇచ్చేవారని, దానికి బ్యాంకుల చుట్టూ తిరిగి ష్యూరిటీ పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఉచితంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ (CM KCR) బీసీ కులాల్లో అన్ని కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ముదిరాజు, బెస్త, గీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, గౌడ్, యాదవ సోదరులు ఇలా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించారన్నారు. గ్రామీణ వృత్తులకు జవసత్వాలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసే సంకల్పంతో ప్రభుత్వం యాదవులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తోందన్నారు. మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు.
బెస్త, ముదిరాజుల ఉపాధి కోసం చెరువుల్లో చేపల పెంపకం ప్రోత్సాహాకానికి 100 శాతం సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ చేస్తుందన్నారు. గీత, చేనేత, మత్స్య కార్మికులతో పాటు వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా కల్పిస్తున్నదని, గౌడ సోదరులకు తాటి చెట్లపై పన్ను రద్దు చేయడమేగాక, పాత బకాయిలనూ మాఫీ చేసిందని, లైసెన్సు కాలపరిమితిని 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచిందన్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
చేనేత మిత్ర పథకం ద్వారా సబ్సిడీ కల్పిస్తున్నామన్నారు. కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు బిసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్నారని, ప్రతి పల్లె స్వయం సమృద్ధి సాధించి పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలనే నానుడిని నిజం చేస్తున్నాయన్నారు. తెలంగాణకు పూర్వం కేవలం 19 బీసీ గురుకులాలు, 7580 విద్యార్థులు ఉంటే, నేడు 310 బీసీ గురుకులాల్లో 2022-23లో 33స్కూళ్లను,15 డిగ్రీకాలేజీలు నూతనంగా ఏర్పాటు చేసి, వాటిలో 119 జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసామని, అన్నింట్లో కలిపి 1,81,880 విద్యార్ధులు ఉన్నారన్నారు.
ఒకప్పుడు కేసీఆర్ గజ్వేల్ (Ghazal) లో గెలవక ముందు గజ్వేల్ వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని, రోడ్లు కూడా ఉండేవి కాదని, గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ గా సీఎం కేసీఆర్ మార్చారన్నారు. గజ్వేల్‌లో త్వరలో మరో వంద పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.