నేడు తెలంగాణ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌రావు
Telangana Budget | 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. గతేడాది మార్చి 7వ తేదీన రూ. 2.71 లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ నిన్న ఆమోదం తెలిపిన విషయం విదితమే. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి […]

Telangana Budget | 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. గతేడాది మార్చి 7వ తేదీన రూ. 2.71 లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ నిన్న ఆమోదం తెలిపిన విషయం విదితమే. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో.. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు. అయితే ఈ సారి గత బడ్జెట్ కంటే 20 శాతం నిధులు అధికంగా కేటాయించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ సర్కార్‌కు ఇదే చివరి బడ్జెట్ కానుండటంతో.. ఎన్నికల వేళ బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వార్షిక బడ్జెట్ కోసం తెలంగాణ ప్రజానీకం ఎదురుచూస్తోంది.