Minister Jagdish Reddy | తండ్రి, తనయుడితో కలిసి.. నారు విత్తనాలు వేసిన మంత్రి జగదీష్‌రెడ్డి

Minister Jagdish Reddy | Suryapeta రోహిణి కార్తె పూర్తయ్యే నాటికి నాట్లు పడాలి పంట సాగును ముందుకు జరపాలి తద్వారా రెండో పంటకు ప్రకృతి వైపరీత్యాల తాకిడి ఉండదు నవంబర్ చివరి నాటికి రెండో పంట నాట్లు పూర్తి చేయాలి వ్యవసాయనిపుణులు, శాస్త్రవేత్తలు, రైతుప్రతినిధుల మేధోమధనంతోనే నిర్ణయం విధాత: పంట సాగును ముందుకు జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తద్వారా రెండో పంటను ప్రకృతి […]

  • Publish Date - June 4, 2023 / 02:29 PM IST

Minister Jagdish Reddy | Suryapeta

  • రోహిణి కార్తె పూర్తయ్యే నాటికి నాట్లు పడాలి
  • పంట సాగును ముందుకు జరపాలి
  • తద్వారా రెండో పంటకు ప్రకృతి వైపరీత్యాల తాకిడి ఉండదు
  • నవంబర్ చివరి నాటికి రెండో పంట నాట్లు పూర్తి చేయాలి
  • వ్యవసాయనిపుణులు, శాస్త్రవేత్తలు, రైతుప్రతినిధుల మేధోమధనంతోనే నిర్ణయం

విధాత: పంట సాగును ముందుకు జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తద్వారా రెండో పంటను ప్రకృతి వైపరీత్యాల బారి నుండి కాపడబడిన వారమౌతామని ఆయన తేల్చి చెప్పారు.

పంట సాగును ముందుకు జరపాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతాంగం లో చైతన్యం కలిగించేందుకు గాను మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తన స్వగ్రామం నాగారం మండల కేంద్రంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా రంగంలోకి దిగి నారు విత్తనాలు వేశారు.

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, నీటి పారుదల అధికారి రమేష్ బాబు లతో కలసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహజంగా వ్యవసాయ దారుడైన మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా నారు మడిలోకి దిగి మొదటి పంట కొరకై వరి విత్తనాలను వెదజల్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తండ్రి రామచంద్రా రెడ్డి, తనయుడు వేమన్ రెడ్డిలను తోడ్కొని నారుమడిలో ఆయన విత్తనాలను వెద జల్లారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోహిణి కార్తె పూర్తి అయ్యే లోపు మొదటి పంట నాట్లు వేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ఇదేమి కొత్త పద్దతి కాదని గతంలో ఉన్నదే నని ఆయన పేర్కొన్నారు. రెండో పంటపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం పడుతుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత పద్దతిని పునరుద్ధరించారని ఆయన పేర్కొన్నారు.

ఇందు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతు సంఘం ప్రతినిధులతో మేధోమధనం చేసిన మీదటనే ఈ నిర్ణయానికి వచ్చారన్నారు. ఇందులో అపోహలు సృష్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇప్పటికే కోదాడ, హుజుర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలతో పాటు నిజమాబాద్ జిల్లా జక్కల్ లోను ఇదే పద్దతిలో నాట్లు పెడుతున్న విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.

సాగును ముందుకు జరపడం ద్వారా పంట దిగుబడి పెరగడంతో పాటు రెండో పంట సురక్షితంగా ఇంటికి చేరుతుందన్న చైతన్యం రైతాంగంలో కల్పించాలన్నారు. అందులో భాగమే తన వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా రంగంలోకి దిగి వానాకాలం పంటకు విత్తనాలు వెదజల్లినట్లు మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Latest News