ఒక్క రాజగోపాల్ రెడ్డి ధనవంతుడైతే.. ప్రజలు ధనవంతులు కారు: కేటీఆర్
విధాత: ప్రధాని నరేంద్ర మోదీ రైతులను మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. కానీ అది జరగలేదు. ఒకే ఒక్క వ్యక్తి ఆదాయం పెరిగింది. అదానీ ఆదాయం పెరిగింది. దేశమంతా పేదరికంలో ఉండిపోయింది. ఒక్కరో, ఇద్దరో ధనవంతులైతే దేశ సంపద పెరుగుతదని మోదీ ప్రభుత్వం అనుకుంటుందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి ఒక్కడు ధనవంతుడైతే మొత్తం నల్లగొండ జిల్లా […]

విధాత: ప్రధాని నరేంద్ర మోదీ రైతులను మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. కానీ అది జరగలేదు. ఒకే ఒక్క వ్యక్తి ఆదాయం పెరిగింది. అదానీ ఆదాయం పెరిగింది. దేశమంతా పేదరికంలో ఉండిపోయింది. ఒక్కరో, ఇద్దరో ధనవంతులైతే దేశ సంపద పెరుగుతదని మోదీ ప్రభుత్వం అనుకుంటుందని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఈ నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి ఒక్కడు ధనవంతుడైతే మొత్తం నల్లగొండ జిల్లా అంతా బాగుపడుతదని మోదీ అనుకుంటున్నాడు. అది ఆయన అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కడు ధనవంతుడైతే దేశ సంపద పెరగదు. ఒక్క రాజగోపాల్ రెడ్డి ధనవంతుడైతే.. నల్లగొండ జిల్లా ప్రజల, రైతుబిడ్డల ఆదాయం పెరగదని మోదీకి కేటీఆర్ చురకలంటించారు. రూ. 18 వేల కాంట్రాక్ట్ మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఇవ్వాలని చెప్పాం. పోటీ నుంచి తప్పుకుంటామని చెప్పాం. ఉలుకు లేదు, స్పందన లేదని మోదీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నెగూడ బీఎంఆర్ సార్ధ ఫంక్షన్ హాల్లో జరిగిన రైతు అవగాహన సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
తెలంగాణలో ఉన్నట్టు వ్యవసాయం, రైతు పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని కేటీఆర్ తెలిపారు. ఎద్దు ఏడ్చిన ఏవుసం బాగుపడదు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని పెద్దలు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆ రైతుల కన్నీరు తుడిచే నాయకుడు లేడు. రైతులు, వ్యవసాయం, సాగునీరు గురించి ఆలోచించేది కేసీఆర్ ఒక్కరు మాత్రమే. రైతుకు కులం, మతం ఉండదు. మనందరిది ఒకే కులం, మతం అని చెప్పడానికే ఆకుపచ్చ కండువాను ధరిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ కండువాను రైతుల ఓట్లు దండుకోవడానికి వాడుకున్నారు.
రైతుల కష్టాలు అవగాహన చేసుకుని, ఆదుకున్న నాయకులు ఎవరూ లేరు. ఇవాళ చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న వచ్చినోళ్లు కూడా కేసీఆర్ను తిడుతున్నారు. ఒక్కసారి పదేండ్లు వెనక్కి వెళ్దాం. కాలిపోయిన మోటార్లు.. పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ కోతలు.. చార్జీల మోతలు, పోలీసు స్టేషన్లలో విత్తనాలు.. ఎరువుల కోసం లైన్లలో చెప్పులు ఆనాటి దుస్థితి. రైతు ఆత్మహత్యలు కూడా మన మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలో అధికంగా జరిగేవి.
కానీ ఇప్పుడు వరిధాన్యం పండించడంలో ఉమ్మడి నల్లగొండ అగ్రభాగాన ఉందన్నారు. రైతు బిడ్డ సీఎం అయ్యాక రైతుల పరిస్థితి మారింది. ఇవాళ తెలంగాణలో కరెంట్ కోతల్లేవు. పదేండ్ల కింద రోజుకు పది గంటలు కరెంట్ పోతే అడిగినోళ్లు లేరు. కానీ ఇప్పుడు పది నిమిషాలు కరెంట్ పోతే పడిరానోళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడం లేదు. ఒకవేళ అలా ఇస్తున్న రాష్ట్రం ఉంటే చూపించాలని ప్రతిపక్ష నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు.