కీలక మంత్రిని.. సీఎం పక్కన కూర్చొని సంతకం పెట్టిస్తా: మంత్రి పొంగులేటి
కీలక మంత్రి పదవిలో ఉన్నా.. మీ సమస్యలన్నింటినీ సీఎం పక్కన కూర్చొని సంతకం పెట్టిస్తానని మంత్రి పొంగులేటి సింగరేణి కార్మికులకు హామీ ఇచ్చారు.

- మీ సమస్యలు పరిష్కరిస్తా
- సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి
విధాత: “గత ప్రభుత్వ మాటలను మీతోపాటు నేను కూడా నమ్మి మోసపోయా… ఈ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిలో ఉన్నా… మీ సమస్యలన్నింటినీ సీఎం పక్కన కూర్చొని సంతకం పెట్టించి పరిష్కరిస్తా ” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సింగరేణి కార్మికులకు హామీ ఇచ్చారు. సోమవారం ఇంల్లందులో సింగరేణి కార్మిక సంఘానికి జరిగే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన పొంగులేటి ఐ ఎన్ టి యూ సి ని గెలిపించాలని కోరారు. 2017 నుండి సింగరేణి కార్మికుల సమస్యల పట్ల నాకు అవగాహన ఉన్నదన్నారు.
గతంలోనే జరగాల్సిన ఎన్నికలను బీఆరెస్ ప్రభుత్వం ఓటమి భయంతో ఎన్నికలు జరపలేదన్నారు. ఒక్కచోట మినహా సింగరేణి వ్యాప్తంగా అన్నిచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారని, కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ ఉందన్నారు. గత ప్రభుత్వం అవకతవకలతో కార్మికులను పట్టించుకోలేదని తెలిపారు.
గత ఐదు సంవత్సరాలలో సింగరేణి గనులు కనుమరుగై కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చిందన్నారు. మా మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాల కల్పనలో సింగరేణి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నారు. ఇల్లందులో జేకేఓసి విస్తరణలో ఇక్కడ కార్మికులు బదిలీ కాకుండా.. ఇంకొక మైనింగ్ ఫిట్3 తో కార్మికులు ఇక్కడే విధుల్లో ఉండేలా చూస్తామన్నారు.
కార్మికుల సొంతింటి కల కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని కృషిచేసిన గత ప్రభుత్వం సహకరించలేదని తెలిపారు. కార్మికులకు వైద్యం కోసం మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వ హయాంలో పరిష్కరిస్తామన్నారు. పోరాటాలు చేశామని చెప్పుకొనే కార్మిక సంఘాలు ఇంకా ఉండవన్నారు. 20 సంలు ప్రభుత్వంలో కి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. కారుణ్య నియామకాలు కోసం కార్మికులు లక్షలు ఇచ్చే పరిస్థితి ఉండేదని, ఇకనుంచి ఒక్క రుపాయి ఖర్చు పెట్ట కుండ కారుణ్య నియామకాలు చేస్తామన్నారు.