Minorities | KCR మైనారిటీల పథకాలు.. సామాజిక, విప్లవాత్మక సంస్కరణలు

Minorities మైనారిటీ గురుకులాలతో పేద ముస్లింలకు ఉన్నత విద్య మదర్సాల వైపు కన్నెత్తి చూడని ముస్లిం విద్యార్థులు షాదీముబారక్‌ పథకంతో వృద్ధ షేక్‌ దుర్మార్గాలు బంద్‌ అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా సీఎం కేసీఆర్‌ పథకాలు ఆసక్తిగా గమనిస్తున్న అంతర్జాతీయ సామాజిక శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని వేధిస్తున్న ముస్లిం తీవ్రవాదం, వెనుకబాటుతనం వాటికి పరిష్కారాలుగా కేసీఆర్‌ ప్రభుత్వ మైనారిటీ పథకాలు Minorities । మదర్సా బిల్డింగులను కూలగొట్టడం తీవ్రవాద సమస్యకు పరిష్కారం కాదు. శాస్త్రీయ, లౌకిక విద్యా విధానాన్ని బోధించడం […]

Minorities | KCR మైనారిటీల పథకాలు.. సామాజిక, విప్లవాత్మక సంస్కరణలు

Minorities

  • మైనారిటీ గురుకులాలతో పేద ముస్లింలకు ఉన్నత విద్య
  • మదర్సాల వైపు కన్నెత్తి చూడని ముస్లిం విద్యార్థులు
  • షాదీముబారక్‌ పథకంతో వృద్ధ షేక్‌ దుర్మార్గాలు బంద్‌
  • అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా సీఎం కేసీఆర్‌ పథకాలు
  • ఆసక్తిగా గమనిస్తున్న అంతర్జాతీయ సామాజిక శాస్త్రవేత్తలు
  • ప్రపంచాన్ని వేధిస్తున్న ముస్లిం తీవ్రవాదం, వెనుకబాటుతనం
  • వాటికి పరిష్కారాలుగా కేసీఆర్‌ ప్రభుత్వ మైనారిటీ పథకాలు

Minorities ।

మదర్సా బిల్డింగులను కూలగొట్టడం తీవ్రవాద సమస్యకు పరిష్కారం కాదు. శాస్త్రీయ, లౌకిక విద్యా విధానాన్ని బోధించడం ద్వారా వారిని ప్రధాన స్రవంతిలో మమేకం చేయవచ్చు అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించింది. మానవీయ కోణంతో కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న విధానాలు మైనారిటీ విద్యార్థులకు చాలా మేలు చేస్తున్నాయి.

ముస్లిం మతస్థులకు(Minorities) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అసహనం, హింస పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పనిగట్టుకుని మత విద్వేషాలను రేపుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు బాహాటంగానే మసీదులను కూలగొడతామంటూ సవాలు విసురుతున్నారు. అసోం ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకు వేసి 600 మదరసాలను (madarsa) కూల్చివేసాం అని ప్రకటించాడు. ఆయన పార్టీ వారు పాకిస్తాన్‌లో శత్రు శిబిరాలను కూల్చి వేసినంతగా సంబరాలు చేసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో మధ్య రాత్రి ఒక మసీదుపై గత ఏడు దశాబ్దాలుగా ఎగరని పాకిస్తాన్ జెండా నాటకీయంగా ఎగిరింది. ఆ విషయం మసీదులో ప్రార్థన చేసేవారికి తెలియక ముందే లక్నోలో ఉన్న ముఖ్యమంత్రికి తెలిసిపోయింది. మసీదు చుట్టుపక్కల వాళ్ళు నిద్ర లేవక ముందే వందల కెమెరాల మధ్య బుల్‌డోజర్‌ (bulldozer) వచ్చి మసీదును కూల్చి వేసింది. ఇదంతా యాదృచ్ఛికం అనిపించినా.. దేశవ్యాప్తంగా ఒక పద్ధతి ప్రకారం విద్వేషం కొనసాగించే ఘటనలు జరుగుతున్నాయి.

నాయకులలో ఉన్న మత పిచ్చి మోతాదును బట్టి ఢిల్లీ నాయకులు స్క్రిప్ట్ ఇస్తున్నారు. దానికి అనుగుణంగానే నాయకుల నుండి అభ్యంతరకరమైన ప్రకటనలు వినిపిస్తాయి. ఉత్తర ప్రదేశ్‌లో కొద్దిమంది ఉన్మాదులుగా మారి మతకలహాలు సృష్టించడానికి తాము దేవతగా పూజించే ఆవును చంపారు. ఇలాంటి ఉన్మాదులనే జాతీయ వాదులుగా చిత్రీకరిస్తున్నారు. దేశాన్ని మరో శతాబ్దం పాటు రావణ కాష్టంలా తగలపెట్టడానికి సరిపోయే స్థాయిలో ఉన్మాదులను సృష్టించారు.

మదర్సాలను కూల్చడం పరిష్కారం కాదు

మదర్సా బిల్డింగులను కూలగొట్టడం తీవ్రవాద సమస్యకు పరిష్కారం కాదు. శాస్త్రీయ, లౌకిక విద్యా విధానాన్ని బోధించడం ద్వారా వారిని ప్రధాన స్రవంతిలో మమేకం చేయవచ్చు అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించింది. మానవీయ కోణంతో కేసీఆర్‌ (K Chandrasekhar Rao) ప్రభుత్వం తీసుకున్న విధానాలు మైనారిటీ విద్యార్థులకు చాలా మేలు చేస్తున్నాయి.

విద్యా సంస్కరణ కాదు.. సామాజిక సంస్కరణ

ప్రత్యేకించి మైనారిటీ విద్యార్థులకు పెద్ద సంఖ్యలో గురుకులాలను (Telangana Minorities Residential Schools) కేసీఆర్‌ ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం 204 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేస్తే.. అందులో ఒక్కో గురుకులం 640 మంది చొప్పున లక్షా 30వేల మందికిపైగా చదువుకుంటున్నారు. వీటిలో ఇంటర్మీడియట్‌ వరకు అవకాశం ఉన్నది. ఇది చూడటానికి విద్యా సంస్కరణగా కనిపించినా.. దానికి మించిన సామాజిక సంస్కరణ (social reform) కోణం ఇందులో ఇమిడి ఉన్నది.

అప్పటి దాకా మదర్సాలపై ఆధారపడిన పేద ముస్లిం (muslim) విద్యార్థులు సమగ్ర విద్యాభ్యాసం చేసేందుకు అవకాశం ఏర్పడింది. అప్పటిదాకా పేదరికంలో మగ్గి, రెస్టారెంట్లలోనో, మెకానిక్‌ షాపులలోనో, లారీలలోనో పనిచేస్తూ బాల్యం కోల్పోయిన విద్యార్థులు.. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదువుకుంటూ డాక్టర్లుగా, ఇంజినీర్లుగా ఎదిగేందుకు ప్రభుత్వం అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. పేదరికం వలన మదర్సాలలో చేర్పించాలని ఆలోచిస్తున్న తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని చూపించింది.

తెగిపోయిన ఉగ్రవాద లింకులు

తెలంగాణ ఏర్పడటానికి ముందు దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా హైదరాబాద్‌ (hyderabad) లింకు అనేది బయటకు వస్తుండేది. ఆ లింకు ఏదో ఒక మదర్సా దగ్గర ఆగేది. ఇప్పడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఆ లింకును విప్లవాత్మకమైన చర్య అయిన మైనారిటీ గురుకుల విద్యాలయాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం తెంపేసింది.

ఒక మదర్సాలో ఉన్మాదం తలకెక్కించుకున్న వ్యక్తి.. మరో పది మందిని ఆ ఉన్మాదంలోకి దింపగలడేమో కానీ.. అదే వ్యక్తి చక్కగా చదువుకుని ఏ డాక్టరో, ఇంజినీరో అయితే.. ఆయనను చూసి లేదా ఆయనతో ప్రభావితమై మరింత మంది చదువుకోవాలనే భావనకు వస్తారనడంలో సందేహం లేదు. తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా అదే చేసింది. పాకిస్థాన్‌లో కూడా ప్రభుత్వ రంగంలో ఇంతమంది విద్యార్ధులకు రెసిడెన్షియల్ సౌకర్యం కల్పించడం లేదు.

పాకిస్థాన్‌ ఉగ్రవాదులు మదర్సాల నుంచే..

అంతర్జాతీయ సామాజిక శాస్త్రవేత్తలు, శాసన కర్తలు తెలంగాణ మోడల్‌ను (Telangana Model) ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే ముస్లిం దేశాలలో తీవ్రవాద సమస్య పరిష్కారం కొరకు విద్యార్థులను మదర్సాల నుంచి తప్పించి, ప్రభుత్వ స్కూళ్లలో వేసి, లౌకిక పాఠ్యాంశాలను బోధించాలని అంతర్జాతీయ సమాజం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. కానీ ఆ నిధులను పాకిస్తాన్ ప్రభుత్వం నేరుగా తీవ్రవాద ప్రేరేపిత మదర్సాలకు పంపి, సమస్యను మరింత జటిలం చేసింది.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో 45 వేల మదర్సాలు ఉన్నాయి. ధనవంతుల పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదివితే పేద విద్యార్థులందరూ మదర్సాలలో చదువుతూ తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. తీవ్రవాద సమస్యకు రెసిడెన్షియల్ స్కూల్ విద్యా విధానం ద్వారా సమగ్రమైన పరిష్కారాన్ని చూపిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే.

షాదీముబారక్‌తో దుబాయ్‌ షేక్‌లకు చెక్‌

ఈ మధ్య కాలంలో సౌదీ అరేబియా ప్రభుత్వం వాషింగ్టన్ డి.సి.లో బిజినెస్ కాన్ఫరెన్స్‌ను (Saudi Arabia Business Confere) ఏర్పాటు చేసింది. సౌదీ అరేబియాకు చెందిన సుమారు 70 సంవత్సరాల వృద్ధుడు తెలంగాణ వ్యక్తి దగ్గరకు వచ్చి కేసీఆర్‌పై ఆక్రోశం వ్యక్తం చేశాడు. కారణం ఏమిటని అడగగా ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు.

గత 30 సంవత్సరాలుగా అతను హైదరాబాద్‌ వచ్చి, బ్రోకర్ సహాయంతో మైనారిటీ తీరని ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకొని, కొద్ది రోజుల తర్వాత తలాక్ ఇచ్చి వెళ్లేవాడు. పెళ్లి ద్వారా పుట్టిన పిల్లలు అనాథలుగా మారి.. గత్యంతరం లేక మదర్సాలలో చేరేవారు. అతని లాంటి నిత్య పెళ్లి కొడుకులు ఎందరో అరబ్ దేశాల నుండి వచ్చేవారు.

హైదరాబాద్‌ అంతర్జాతీయ సెక్స్ టూరిజం నగరంగా (City of Sex Tourism) ఉండేది. ఈ విష వలయాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ (Shaadi Mubarak) పథకం ఛేదించింది. బ్రోకర్లు, దొంగ ఖాజీలు నిరుద్యోగులయ్యారు. నిత్య పెళ్లి కొడుకులు బ్రోకర్ల సహాయంతో అమ్మాయి తండ్రిని ఒప్పించినా, తల్లులు ఎదురు తిరిగి అరబ్ షేక్‌లతో పెళ్లి కాకుండా అడ్డకుంటున్నారు. కొంతమంది మహిళలు తాగుబోతు భర్త ను ఇంట్లో నుండి పంపించి, షాదీ ముబారక్ ద్వారా వచ్చే డబ్బుతో పిల్లల పెండ్లి చేస్తున్నారు.

షాదీ ముబారక్ పథకం ముస్లిం మహిళలలో ఆర్థిక స్వతంత్రను, ఆత్మ గౌరవాన్ని పెంచింది. ఈ పథకం 2014 నుండి 2,38,917 మంది అమ్మాయిలకు అందింది. ప్రస్తుతం 97 మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో 50వేల మంది విద్యార్థినులు చదువుతున్నారు. షాదీ ముబారక్ పథకం లేనట్లయితే ఇప్పటికీ వయస్సు మళ్లిన ఆరబ్ షేకులతో కొంతమంది విద్యార్థినుల పెళ్లి జరిగి ఉండేది.

ముస్లిం సమాజాల వెనుకబాటుతనానికి తెలంగాణలో పరిష్కారాలు

రెసిడెన్షియల్ పాఠశాలలు, పాదీ ముబారక్ పథకం మైనారిటీ వర్గంలో ఉన్నత విద్య, ఆర్థిక, సామాజిక ఉన్నతికి దోహదం చేస్తున్నాయి. అంతర్జాతీయ సమాజాన్ని వేధిస్తున్న ముస్లిం తీవ్రవాదం, వెనుకబాటుతనం సమస్యలకు పరిష్కారాలుగా కనిపిస్తున్నాయి. ఈ పథకాలు ప్రభుత్వం ఊహకందని విధంగా వివిధ రంగాలలో ప్రభావం చూపిస్తున్నాయి.

ఈ పథకాల అమలుపై అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ లాంటి విద్యాలయంతో సమగ్ర నివేదిక చేయిస్తే ముస్లిం సమాజానికి పథకాలు రూపొందించే ప్రభుత్వాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఈ పథకాలను మెరుగుపరచడానికి దోహదపడుతుంది.

– డాక్టర్‌ మాధవరం నాగేందర్‌రావు