కవిత కేసు విచారణ నవంబర్‌ 20కి వాయిదా

  • Publish Date - September 26, 2023 / 09:54 AM IST

విధాత, డిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణ ప్రక్రియలో మహిళగా తనకు మినహాయింపులు ఇవ్వాలని కోరుతు ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటిదాకా కవితకు సమన్లు ఇవ్వరాదని ఈడీని సుప్రీం ఆదేశించింది.


కోర్టు ఆదేశాల మేరకు 20వ తేదీ వరకు విచారణకు పిలవబోమని ఈడీ సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళ అయినంత మాత్రాన విచారణ వద్దనలేమని, అయితే మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాల్సివుంటుందని పేర్కోంది. తదుపరి విచారణ 20 తేదీకి వాయిదా వేసింది.