MLC Kavitha | ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ
MLC Kavitha విధాత, మెదక్ బ్యూరో: అతి పిన్న వయసులో కొడుకు విష్ణు వర్ధన్ రెడ్డి ఆకాల మరణంతో దుఃఖంలో ఉన్న పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ కుటుంబాన్నిఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం పరామర్శించారు. విష్ణు వర్ధన్ రెడ్డి మరణం తనను తీవ్రంగా కలిసి వేసిందని కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఎదుగుతున్న విష్ణువర్థన్ రెడ్డి అకాల మరణం చాల బాధాకరమన్నారు. కుమారుణ్ణి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని […]

MLC Kavitha
విధాత, మెదక్ బ్యూరో: అతి పిన్న వయసులో కొడుకు విష్ణు వర్ధన్ రెడ్డి ఆకాల మరణంతో దుఃఖంలో ఉన్న పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ కుటుంబాన్నిఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం పరామర్శించారు. విష్ణు వర్ధన్ రెడ్డి మరణం తనను తీవ్రంగా కలిసి వేసిందని కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాజకీయాలలో ఎదుగుతున్న విష్ణువర్థన్ రెడ్డి అకాల మరణం చాల బాధాకరమన్నారు. కుమారుణ్ణి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. లక్షలాది మంది ప్రజలకు నిరంతరం సేవ చేసే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి పుత్ర శోకం కలగడం తనను దిగ్బ్రాంతికి గురి చేసిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.