PM Modi | మోదీ.. మాట్లాడక తప్పదు

PM Modi చర్చకు సమాధానం ఆయనే ఇవ్వాలి అందుకోసమే ‘ఇండియా’ అవిశ్వాసం ప్రతిపక్షాల ఐక్యత చాటేందుకు చాన్స్‌ తురుపు ముక్క వదిలిన ప్రతిపక్షాలు న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అది వీగిపోవడం ఖాయం. మరి ప్రతిపక్షాలు సాధించేది ఏమిటి? వీగిపోయే తీర్మానాన్ని ప్రతిపక్షాలు ఎందుకు ఎంచుకున్నాయి? ఇది తమ ఆఖరి అస్త్రంగా ఎందుకు చెబుతున్నాయి? ఇది పక్కా ప్రణాళిక ప్రకారం.. మణిపూర్‌ హింసపై మౌనం దాల్చుతున్న ప్రధాని మోదీ నోరు బలవంతంగానైనా తెరిపించే ప్రయత్నమే. […]

PM Modi | మోదీ.. మాట్లాడక తప్పదు

PM Modi

  • చర్చకు సమాధానం ఆయనే ఇవ్వాలి
  • అందుకోసమే ‘ఇండియా’ అవిశ్వాసం
  • ప్రతిపక్షాల ఐక్యత చాటేందుకు చాన్స్‌
  • తురుపు ముక్క వదిలిన ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అది వీగిపోవడం ఖాయం. మరి ప్రతిపక్షాలు సాధించేది ఏమిటి? వీగిపోయే తీర్మానాన్ని ప్రతిపక్షాలు ఎందుకు ఎంచుకున్నాయి? ఇది తమ ఆఖరి అస్త్రంగా ఎందుకు చెబుతున్నాయి? ఇది పక్కా ప్రణాళిక ప్రకారం.. మణిపూర్‌ హింసపై మౌనం దాల్చుతున్న ప్రధాని మోదీ నోరు బలవంతంగానైనా తెరిపించే ప్రయత్నమే.

అవిశ్వాసంపై చర్చను మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దానితోపాటే తాము ఐక్యంగా ఉన్నామని చాటడమే వాటి లక్ష్యంగా ఉన్నది.

మోదీని పార్లమెంటుకు రప్పించాలి

ప్రభుత్వం నుంచి, ప్రత్యేకించి ప్రధాని నుంచి ప్రతిపక్షాలు సమాధానం కోరుతున్న కీలక అంశం మణిపూర్‌. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో చర్చకు హోం మంత్రి అమిత్‌షా సమాధానం ఇస్తారని చెబుతూ వస్తున్నది. కానీ.. ప్రతిపక్షాలు మాత్రం మోదీ ప్రకటన, అనంతరం చర్చకు డిమాండ్‌ చేస్తున్నాయి.

‘ఇండియా కూటమికి లోక్‌సభలో సంఖ్యాబలంపై అవగాహన ఉన్నది. కానీ.. ఇది సంఖ్యాబలానికి సంబంధించిన అంశం కాదు. ఇది మణిపూర్‌కు జరగాల్సిన న్యాయం గురించి’ అని గౌరవ్‌ గగోయ్‌ చెప్పారు.

మణిపూర్‌ ప్రజలకు ప్రతిపక్షాల కూటమి సంఘీభావాన్ని ఈ చర్య ద్వారా అందించాలని అనుకుంటున్నామని తెలిపారు. దానితోపాటే ఈ అంశంపై ప్రధాని పార్లమెంటుకు వచ్చి, మాట్లాడేలా ఒత్తిడి చేసేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.

బలాబలాలు ఇవీ..

లోక్‌సభలో మెజార్టీ మార్కు 272గా ఉన్నది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 320కిపైగా సభ్యలుంటే.. ఒక్క బీజేపీకే 303 మంది ఉన్నారు. ‘ఇండియా’ కూటమిలోని పార్టీలకు 141 మంది ఉన్నారు.