Komatireddy | కాంట్రాక్టర్లు రియల్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోండి: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy | విధాత: కాంట్రాక్టర్లు, రియల్టర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాట్లాడుతూ.. బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తే ఖబర్దార్ అంటూ వెంకటరెడ్డి హెచ్చరించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారని వెల్లడించారు. కేసీఆర్ చెప్పిన సామాజిక తెలంగాణ ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఎక్కువ మంది ఓసి లేనన్నారు. […]

  • Publish Date - August 16, 2023 / 12:35 PM IST

Komatireddy | విధాత: కాంట్రాక్టర్లు, రియల్టర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాట్లాడుతూ.. బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తే ఖబర్దార్ అంటూ వెంకటరెడ్డి హెచ్చరించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారని వెల్లడించారు. కేసీఆర్ చెప్పిన సామాజిక తెలంగాణ ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఎక్కువ మంది ఓసి లేనన్నారు.

ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా రైతు రుణమాఫీ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయచూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ రైతు రుణమాఫీ వడ్డీకే సరిపోయిందన్నారు.ఆయన చేసింది రుణమాఫీ కాదని వడ్డీ మాఫీ మాత్రమే అన్నారు. ఎన్నికలలో లబ్ధి పొందే ఉద్దేశంతో ప్రభుత్వ భూములను అమ్మి, ఔటర్ రింగ్ రోడ్డు నువ్వు వేలం పెట్టి, ముందస్తుగా వైన్స్ టెండర్లు వేసి వచ్చిన వేలకోట్లతో రుణమాఫీ, రైతుబంధు, బీసీ బంధు,మైనారిటీ బంధు వంటి జనాకర్షణ పథకాలతో మళ్ళీ ఎన్నికల ముందు ప్రజలను మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ అమెరికాల బాత్రూమ్ లు కడుగుతుండేనన్నారు. కేసీఆర్ ఇస్తానన్న పంట నష్టం పదివేల రూపాయలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. నాకు ఎంపీ, ఎమ్మెల్యే,,మంత్రి , ముఖ్యమంత్రి పదవి అవసరం లేదనీ, నాకు బతుకు తెలంగాణ కావాలన్నారు.
నాకు వ్యాపారాలు లేవనీ, గుట్టలు ,కొండలు అమ్ముకోనన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వియ్యంకుడికి సీఎం కేసీఆర్ గందమల్ల రిజర్వాయర్ పనులు అప్పగించిండన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని,పేదలు రైతులకు సంక్షేమ రాజ్యం తెస్తుందన్నారు.