" /> " /> " /> " />

తను పుట్టిన ‘పేట్లబుర్జు’ దవాఖానకు ఎంపీ సంతోష్ చేయూత.. రూ.కోటి కేటాయింపు – vidhaatha

తను పుట్టిన ‘పేట్లబుర్జు’ దవాఖానకు ఎంపీ సంతోష్ చేయూత.. రూ.కోటి కేటాయింపు

అభినందించిన ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విధాత, హైదరాబాద్: తాను పుట్టిన పెట్లబుర్జు దవాఖాన అభివృద్ధికి ఎంపీ సంతోష్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం తన ఎంపీ (రాజ్యసభ) నిధుల నుంచి కోటి రూపాయలను కేటాయించారు. తాను పుట్టిన హాస్పిటల్‌ను మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని, అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం" అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎంపీ సంతోష్ నిర్ణయం ఎంతో […]

  • Publish Date - November 11, 2022 / 04:27 PM IST

అభినందించిన ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

విధాత, హైదరాబాద్: తాను పుట్టిన పెట్లబుర్జు దవాఖాన అభివృద్ధికి ఎంపీ సంతోష్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం తన ఎంపీ (రాజ్యసభ) నిధుల నుంచి కోటి రూపాయలను కేటాయించారు. తాను పుట్టిన హాస్పిటల్‌ను మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని, అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం” అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఎంపీ సంతోష్ నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తిదాయ‌క‌మ‌న్నారు. అంతేకాదు ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధికి ముందుకు రావడానికి దోహద పడుతుందన్నారు. ఈ నిధులతో పేట్ల బుర్జు హస్పిటల్‌ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఎంపీ సంతోష్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్‌లో జన్మించిన వారు, ఆయా ఆసుపత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్శ్‌రావు పిలుపునిచ్చారు. పేట్ల బుర్జు దవాఖాన అవసరాలు, సౌకర్యాలు తీర్చేలా నిధులు వినియోగించాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు.