Uttam Kumar Reddy | బీఆరెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ వారే వద్దంటున్నారు: ఎంపీ ఉత్తమ్‌

పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ ఎద్దేవా బొల్లంను ఓడిస్తేనే బీఎంటీ ట్యాక్స్ పోతుంది Uttam Kumar Reddy | విధాత: బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్లు ఇవ్వడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే వ్యతిరేకిస్తు తీర్మానాలు చేస్తున్నారని, ఎన్నికల్లో ఆ పార్టీ సిటింగ్‌ల ఓటమి ఖాయమని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతు కోదాడలో వెంచర్ వేయాలంటే మూడు లక్షల రూపాయల […]

  • Publish Date - August 23, 2023 / 11:46 AM IST
  • పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ ఎద్దేవా
  • బొల్లంను ఓడిస్తేనే బీఎంటీ ట్యాక్స్ పోతుంది

Uttam Kumar Reddy | విధాత: బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్లు ఇవ్వడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే వ్యతిరేకిస్తు తీర్మానాలు చేస్తున్నారని, ఎన్నికల్లో ఆ పార్టీ సిటింగ్‌ల ఓటమి ఖాయమని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతు కోదాడలో వెంచర్ వేయాలంటే మూడు లక్షల రూపాయల బీఎంటీ(బొల్లం మల్లయ్య ట్యాక్స్‌) పన్ను కట్టాల్సిన అవసరం ఏమిటంటు ప్రశ్నించారు.

బొల్లంను ఓడిస్తే ప్రజలకు బీఎంటీ భారం పోతుందన్నారు. సీఎం కేసీఆర్ మాదిరిగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా అక్రమ, అవినీతి వ్యాపారాల్లో మునిగిపోయారన్నారు. దళిత బంధులో 70% అవినీతి, అక్రమాలు జరిగిన మాట వాస్తవమన్నారు. బీఆరెస్ పార్టీ ముదిరాజ్ కులానికి ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించకపోవడం బాధాకరమని, ముదిరాజ్ కులస్తులు బీఆరెస్ పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

12% ఉన్న ముస్లింలకు మూడు టిక్కెట్లు కేటాయించి ముస్లిం కులాలను అవమనపరిచారన్నారు. 25 లక్షల మంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నదని, వారంతా వచ్చే ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ కి బుద్ధి చెప్పాలన్నారు. కోదాడ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ పద్మావతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీలో ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో గెలుస్తామని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలవడం ఖాయమన్నారు.