కేక పెట్టిస్తున్న ధోని న్యూ లుక్.. వింటేజ్ లుక్ చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

  • By: sn    latest    Oct 05, 2023 2:38 AM IST
కేక పెట్టిస్తున్న ధోని న్యూ లుక్.. వింటేజ్ లుక్ చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క్రికెట్‌లో ఏ కెప్టెన్‌కు సాధ్యంకానీ మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించి పెట్టిన నాయ‌కుడిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకున్నాడు. ధోని రిటైర్మెంట్ ప్ర‌క‌టించి దాదాపు మూడు సంవ‌త్స‌రాలు అవుతున్నా కూడా ఇంకా అత‌ని క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.



ఎప్పుడు ఏదో ఒక విష‌యంతో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ క్రికెటర్లలో ధోని ఒకరు కాగా, ఆయ‌న తాజాగా సరికొత్త హెయిర్ స్టైల్‌తో క‌నిపించి అద‌ర‌హో అనిపించాడు. ధోనిని ఇలా చూసిన వారంద‌రు హాలీవుడ్ హీరోలా ఉన్నాడ‌ని, అచ్చం మ‌హేష్ బాబు మాదిరిగా క‌నిపిస్తున్నాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు.



 తన పొడవాటి జుట్టుకు గోల్డెన్ టచ్ ఇచ్చిన ధోనీ.. మ‌ళ్లీ ఓల్డ్ లుక్‌ని గుర్తు చేస్తున్నాడు. భారత జట్టులోకి కొత్తగా అడుగుపెట్టినప్పుడు ఈ తరహా లుక్‌లోనే ధోని క‌నిపించి సంద‌డి చేశాడు. ధోని లాంగ్‌ హెయిర్‌ స్టైల్ తో ఎంతో మంది క్రికెట్‌ ఫ్యాన్స్ మ‌న‌సులు గెలుచుకున్నాడు.



సాధార‌ణ ఫ్యాన్స్ కాకుండా, పాకిస్తాన్‌ దివంగత అధ్యక్షుడు ముషారప్‌ వంటి ప్రముఖులు కూడా ధోని జులపాల జుట్టుకు ఫిదా అయ్యారు. 2011లో టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోని పొడ‌వాటి జ‌ట్టు క‌ట్ చేయించుకొని, సాధార‌ణ హెయిర్‌స్టైల్‌తో క‌నిపించారు. అయితే మ‌ధ్య మ‌ధ్య‌లో ధోని త‌న హెయిర్ స్టైల్‌ని చాలా సార్లు మార్చ‌డం మ‌నం చూస్తూనే వ‌స్తున్నాం.



కొన్ని రోజులు క్రితం యూఎస్ ఓపెన్ మ్యాచ్ టైమ్ లో గుబురు గడ్డంతో కనిపించిన ధోని.. ఆ త‌ర్వాత పిల‌క‌తో స్టైలిష్‌గా ద‌ర్శ‌న‌మిచ్చాడు.ఇక ఇప్పుడు లూజ్ హెయిర్ తో బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని అచ్చం హీరో మహేశ్ బాబులా కనిపిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.



ధోని న్యూ లుక్‌పై ఫ్యాన్స్ ప‌లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ధోని, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రు క‌లిసి ఓ యాడ్ చేయ‌బోతున్నార‌ని, దాని కోస‌మే ధోని ఇలాంటి గెట‌ప్‌లోకి మారాడ‌ని చెప్పుకొస్తున్నారు. రీసెంట్‌గా ధోని, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి దిగిన పిక్ కూడా నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేయ‌డం మ‌నం చూశాం. మొత్తానికి ధోని త‌న న్యూ హెయిర్ స్టైల్‌తో సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ అయ్యాడు.