MULUGU: ఇంట్లోనే కుప్పకూలిన.. ములుగు ZP చైర్మన్ జగదీశ్.. CPR చేసిన భార్య! హాస్పిటల్‌లో అత్యవసర చికిత్స
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జడ్పీ చైర్మన్, ఏటూరునాగారం జడ్పీటీసీ కుసుమ జగదీష్ శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో ఇంట్లోనే కుప్పకూలిన జగదీశ్‌కు ఆయన భార్య రమాదేవి సిపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం హనుమకొండలోని అజార ఆసుపత్రికి తరలించారు. జడ్పీ చైర్మన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు జగదీష్‌కు మైల్డ్ స్ట్రోక్ అని చెప్పారని ఆయన అనుచరులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జడ్పీ చైర్మన్, ఏటూరునాగారం జడ్పీటీసీ కుసుమ జగదీష్ శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో ఇంట్లోనే కుప్పకూలిన జగదీశ్‌కు ఆయన భార్య రమాదేవి సిపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
అనంతరం హనుమకొండలోని అజార ఆసుపత్రికి తరలించారు. జడ్పీ చైర్మన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు జగదీష్‌కు మైల్డ్ స్ట్రోక్ అని చెప్పారని ఆయన అనుచరులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.