విధాత: ఢిల్లీలో శ్రద్దావాకర్ హత్య తరహాలో ముంబై (Mumbai)లో సంచలనం సృష్టించిన సర్వసతి వైద్య (Saraswati vaidya) హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరస్వతిని హత్య చేసిన తర్వాత మనోజ్ సానే (Manoj Sane) ఆమె పొడవాటి జుట్టు కత్తిరించారు. జుట్టును కిచెన్‌లో భద్రపరిచాడు. పోలీసులు విచారణ సందర్బంగా ఘటనా స్థలానికి వచ్చిన సరస్వతి సోదరి ఆ జట్టును చూసి భావోద్వేగానికి గురయ్యారు. సరస్వతిని చంపిన తర్వాత కూడా ఆమె ఫొటోలను మనోజ్ తీశాడు. వాటిని చూసిన ఆమో సోదరి కన్నీరు పెట్టుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బోరివలి గీతానగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో మూడేండ్లుగా మనోజ్ సానే (56), సరస్వతి వైద్య (32) సహజీవనం సాగిస్తున్నారు. సరస్వతి వైద్యను మనోజ్ సానే ఈనెల 4వ తేదీన చంపారు. అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు సమీప దుకాణం నుంచి ఐదు బాటిళ్ల నీల్‌గిరి ఆయిల్‌ను తీసుకొచ్చి వినియోగించాడు. అయినా, దుర్వాసన రావడంతో చుట్టుపక్కల ఉండేవారు చేసిన ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
సరస్వతిని చంపిన మనోజ్ ఆమె మృతదేహాన్ని ముక్కలుచేసేందుకు హార్డ్‌వేర్ షాప్ నుంచి ఉడ్ కట్టర్ తీసుకొచ్చాడు. మృతదేహాన్ని 20 ముక్కలు చేసి, వంటగదిలో 3 బకెట్లలో ఉంచి, ఆ ముక్కలను ఉడకబెట్టి వీధి కుక్కలకు వేసినట్టు పోలీస్ విచారణతో తెలిపాడు. అయితే, అనంతరం ఉడ్ కట్టర్‌ను శుభ్రం చేసి దానిని రిపేర్ కోసం తిరిగి షాప్‌లో ఇచ్చాడు. అయితే, దానికి ఎందుకోసం ఉపయోగించాడు అనేది గుర్తుపట్టకుండా కట్టర్‌ను శుభ్రంచేసినట్టు షాప్ నిర్వాహకులు సోమవారం పోలీసులకు వెల్లడించారు.
సరస్వతి వైద్య అనాథ కాదని, ఆమెకు నలుగురు సోదరీలు ఉన్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ముగ్గురు చెల్లెళ్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. వారు నిందితుడిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ అక్కను చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సరస్వతి, ఆమె నలుగురు చెల్లెళ్లు చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. వీరిని తండ్రి విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు.
అనంతరం అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక అనాథాశ్రమంలో సరస్వతి 10వ తరగతి వరకూ చదివింది. 18వ ఏట బతుకుతెరువు కోసం మంబై వచ్చింది. అక్కడ ఒక రేషన్ షాపులో మనోజ్ సానేతో పరిచయమైంది. ఆమెకు అక్కడే అతను సేల్స్ జాబ్ ఇప్పించాడు.అనంతరం ఇద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఎవరి సమక్షంలో వీరు వివాహం చేసుకొన్నారే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరి మధ్య వయస్సులో చాలా వ్యత్యాసం ఉండటంతో పెళ్లి విషయాన్ని వారు వెల్లడించలేదు.
విచారణలో మనోజ్ చాలా సందర్భాల్లో పోలీసులను తప్పుదోవ పట్టించాడు. అవాస్తవాలు వెల్లడించాడు. అతడి స్టేట్ మెంట్‌ను నిర్ధారించుకొనే సందర్భంలో అవి ఫాల్స్‌గా తేలడంతో మళ్లీ మళ్లీ విచారించారు. శ్రద్ధా వాకర్ హత్య కేసులో అక్బాబ్ తరహాలోనే మృతదేహాన్ని మాయం చేయడం ఎలా అని మనోజ్ సానే కూడా గూగుల్‌లో చాలా సార్లు సెర్చ్ చేశాడు. శరీరాన్ని ఎలా పారవేయాలో తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.