మయన్మార్: అసలేం జరుగుతోంది.. తుపాకులు చేతపడుతున్న ప్రజలు
సాయుధులవుతున్న ప్రజలు తీవ్రమవుతున్న అంతర్యుద్ధం నీవు నన్ను చంపకున్నా, నేను మాత్రం నిన్ను వదలను.. కొడుకుతో ఓ తండ్రి మాటలు. విధాత: మియన్మార్ మిలిటరీ పాలకులు తమ హింసను విడనాడాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి కోరింది. యూఎన్ఓ 74 ఏండ్ల చరిత్రలో మొదటిసారి ఒక దేశ పాలకులను హింసను వీడాలని కోరింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకం అయ్యింది. మియన్మార్‌లో ఏం జరుగుతున్నదనే దానిపై సర్వత్రా ఉత్సుకత ఏర్పడింది. 2021 ఫిబ్రవరిలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అంగ్‌సాన్ సూకీ […]

- సాయుధులవుతున్న ప్రజలు
- తీవ్రమవుతున్న అంతర్యుద్ధం
- నీవు నన్ను చంపకున్నా, నేను మాత్రం నిన్ను వదలను.. కొడుకుతో ఓ తండ్రి మాటలు.
విధాత: మియన్మార్ మిలిటరీ పాలకులు తమ హింసను విడనాడాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి కోరింది. యూఎన్ఓ 74 ఏండ్ల చరిత్రలో మొదటిసారి ఒక దేశ పాలకులను హింసను వీడాలని కోరింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకం అయ్యింది. మియన్మార్‌లో ఏం జరుగుతున్నదనే దానిపై సర్వత్రా ఉత్సుకత ఏర్పడింది.
2021 ఫిబ్రవరిలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి మిలిటరీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. ప్రజాస్వామ్య ఉద్యమ నేత సూకీతో పాటు, వేలాది మంది జైళ్లలో నిర్బంధింప బడ్డారు. సుమారుగా 16వేల మందిని నిర్బంధించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొన్నది.
సూకీ ప్రభుత్వాన్ని మిలిటరీ కూలదోసిన తర్వాత మియన్మార్‌లో తీవ్రమైన అంతర్యుద్ధం జరుగుతున్నది. ప్రజాస్వామ్య ప్రేమికులంతా ప్రజల్లోకి వెళ్లి మిలిటరీ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. సాధారణ ప్రజలు కూడా మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు.
Myanmar diaspora & allies in Thailand protesting against the Junta at the embassy in BKK. ✊