Nagarjuna | అప్పుడు ఆరు నెల‌లు సినిమాలు వ‌దిలేసి అమ‌ల‌తో ఉన్నా.. షాకింగ్ విష‌యాలు చెప్పిన‌ నాగ్

Nagarjuna: అక్కినేని నాగార్జున టాలీవుడ్ హీరోల‌లో ఒక‌రు అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌న కుమారుల సినిమాల‌కి స‌పోర్ట్‌గా ఉంటూనే యువ హీరోల‌కి కూడా త‌న వంతు స‌పోర్ట్ అందిస్తున్నారు. బిగ్ బాస్ షోతో మంచి ఫేమ్ సంపాదించుకున్న సోహైల్ తాజా చిత్రం మిస్ట‌ర్ ప్ర‌గ్నెంట్‌. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం రీసెంట్‌గా జ‌ర‌గ‌గా, ఆ కార్య‌క్ర‌మంకి నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఇక నాగ్ మాట్లాడే స‌మ‌యంలో యాంకర్ మంజూష ఒక విచిత్రమైన ప్రశ్న అడిగింది. […]

  • Publish Date - August 6, 2023 / 07:42 AM IST

Nagarjuna: అక్కినేని నాగార్జున టాలీవుడ్ హీరోల‌లో ఒక‌రు అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌న కుమారుల సినిమాల‌కి స‌పోర్ట్‌గా ఉంటూనే యువ హీరోల‌కి కూడా త‌న వంతు స‌పోర్ట్ అందిస్తున్నారు. బిగ్ బాస్ షోతో మంచి ఫేమ్ సంపాదించుకున్న సోహైల్ తాజా చిత్రం మిస్ట‌ర్ ప్ర‌గ్నెంట్‌. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం రీసెంట్‌గా జ‌ర‌గ‌గా, ఆ కార్య‌క్ర‌మంకి నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఇక నాగ్ మాట్లాడే స‌మ‌యంలో యాంకర్ మంజూష ఒక విచిత్రమైన ప్రశ్న అడిగింది. ‘ఆగస్టు 18న డెలివరీ కాబోతోంది కాబట్టి.. మగబిడ్డ పుడతాడా? ఆడబిడ్డ పుడుతుందా? పుట్టే బిడ్డకు ఏం పేరు పెడతారు?’ అని నాగార్జున‌ని మంజూష ప్రశ్నించారు. వెంటనే నాగార్జున.. ‘ఎవరికి డెలివరీ అన‌గానే అప్పుడు ‘మిస్టర్ ప్రెగ్నెంట్‌కి సార్’ అని మంజూష సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడ నవ్వులు పూయ‌గా, వెంట‌నే నాగ్.. ‘మిస్టర్ ప్రెగ్నెంట్‌కి హిట్టు పుట్టాలి’ అని అన్నారు.

ఇక బిగ్ బాస్ షోలో సోహెల్ ప్ర‌వ‌ర్త‌న నాకింకా క‌ళ్ల మెద‌లుతూనే ఉంటుంది.ఎంతో క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన సోహెల్ మిస్ట‌ర్ ప్ర‌గ్నెంట్ చేయ‌గా, ఈ సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. ఇక మ‌గ‌వాడు గ‌ర్భం దాల్చ‌డం అనే కాన్సెప్ట్ న‌న్ను కూడా ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిందని, ఈ సినిమా చూసేందుకు నేను ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని నాగ్ అన్నారు. ఇక అమ్మతనం గురించి మాట్లాడిన నాగార్జున‌.. ‘మదర్‌హుడ్ అనేది చాలా అందమైన అనుభూతి. అది నాకు ప్రతి నిమిషం గుర్తుంది అని తెలియ‌జేశారు.

హలో బ్రదర్ షూటింగ్ స‌మ‌యంలో నేను షూటింగ్ ఫినిష్ చేసుకుని ఆఖరి ఆరు నెలలు ఏ షూటింగ్‌కు వెళ్లకుండా అమలతోనే ఉన్నాను. ఆమె ప్రసవించేంత వరకు కూడా ఆమెతోనే ఉన్నాను. ఆఖరికి డెలివరీ రూమ్‌లో కూడా ఆమె చేయి పట్టుకు నేను ఉన్నాను. నా జీవితంలో చాలా మంచి అనుభవం ఉందంటే అదే అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక నాగార్జున‌కి ఇటీవ‌ల మంచి స‌క్సెస్ లు రావ‌డం లేదు. అలానే ఆయ‌న కొడుకులు కూడా ఫ్లాపులు చ‌వి చూస్తున్నారు. త్వ‌ర‌లో నాగార్జున బిగ్ బాస్ సీజ‌న్ 7 హోస్ట్‌గా అల‌రించ‌నున్నాడు.

Latest News