Nagarjunasagar: టెలిమెట్రీ కేంద్రాలను పరిశీలించిన KRMB బి బృందం

విధాత: కృష్ణా నది యాజమాన్య బోర్డు మంగళవారం నాడు నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని టెలిమెట్రీ కేంద్రాలను, కుడి కాలువను సందర్శించి పరిశీలించారు. కే ఆర్ ఎం బి చైర్మన్ శివానందన్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం నాగార్జునసాగర్ చేరుకున్న ఈ బృందం నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్‌, స్పిల్ వే మరమత్తు పనులను పరిశీలించారు. మంగళవారం ప్రధాన డ్యామ్ కు పక్కనే ఉన్న డైవర్షన్ టన్నల్ పై ఏర్పాటుచేసిన టెలిమెట్రీ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం కుడికాలువ ప్రధాన ద్వారం, […]

  • Publish Date - April 18, 2023 / 09:11 AM IST

విధాత: కృష్ణా నది యాజమాన్య బోర్డు మంగళవారం నాడు నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని టెలిమెట్రీ కేంద్రాలను, కుడి కాలువను సందర్శించి పరిశీలించారు. కే ఆర్ ఎం బి చైర్మన్ శివానందన్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం నాగార్జునసాగర్ చేరుకున్న ఈ బృందం నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్‌, స్పిల్ వే మరమత్తు పనులను పరిశీలించారు.

మంగళవారం ప్రధాన డ్యామ్ కు పక్కనే ఉన్న డైవర్షన్ టన్నల్ పై ఏర్పాటుచేసిన టెలిమెట్రీ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం కుడికాలువ ప్రధాన ద్వారం, దానితోపాటు కుడికాలువ పై ఏర్పాటు చేసిన టెలిమెట్రీ కేంద్రాన్ని సందర్శించి ఎంత మేరకు నీరు వెళ్తుంది అనే దానిని పరిశీలించారు.. తరువాత టెల్ పాండ్ ప్రాజెక్టును సందర్శించారు. వీరితోపాటు కే ఆర్ ఎం బి సభ్యులు అజయ్ కుమార్ గుప్తా, రెండు తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.