Nalgonda | కొనుగోలు రోజే మిల్లింగ్: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

Nalgonda విధాత: ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని నల్గొండ(Nalgonda) జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన చిట్యాల PACS లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేస్తున్న తీరు తెన్నులను, సమస్యలను, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరిగేందుకు రైతులకు ఇబ్బంది తలెత్తకుండా కొనుగోలు […]

  • Publish Date - April 17, 2023 / 03:26 PM IST

Nalgonda

విధాత: ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని నల్గొండ(Nalgonda) జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన చిట్యాల PACS లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

ధాన్యం కొనుగోలు చేస్తున్న తీరు తెన్నులను, సమస్యలను, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరిగేందుకు రైతులకు ఇబ్బంది తలెత్తకుండా కొనుగోలు రోజునే మిల్లింగ్.. బిల్లింగ్ జరిగేలా మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలిపారు.

అకాల వర్షాల ప్రమాదం ఉన్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోకుండా కొనుగోలు వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియ వేగంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు . ఈ కార్యక్రమంలో DSO వెంకటేశ్వర్లు, PACS చైర్మన్ సుంకరి మల్లేశ్ గౌడ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి, సహకార శాఖ అధికారులు, రైతులు పాల్గోన్నారు.