Nandamuri Balakrishna | బాలయ్య వెరైటీ కోరిక.. జగన్ నోట ఆ డైలాగ్ మళ్ళీ వినాలట.!
విధాత: ఆన్‌స్టాపబుల్, ఇంకా సినిమాలు.. సినిమా ఫంక్షన్స్.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna ) రాజకీయాలను ఎన్నడూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఈ మధ్య ఎందుకనో పాలిటిక్స్‌లో కూడా హుషారుగా ఉంటున్నారు. అప్పుడప్పుడూ పంచ్ డైలాగ్స్ వేస్తున్నారు. లోకేష్‌ను చంద్రబాబును వైసీపీ వాళ్ళు ఎన్నివిధాలా వెక్కిరించని బాలయ్య బాబు ఇప్పుడు మాత్రం గట్టిగానే పంచ్‌లు వేస్తున్నారు. వైసీపీ వాళ్ళను ర్యాగింగ్ చేస్తున్నారు. హిందూపురం నుంచి రెండోసారి […]
విధాత: ఆన్‌స్టాపబుల్, ఇంకా సినిమాలు.. సినిమా ఫంక్షన్స్.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna ) రాజకీయాలను ఎన్నడూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఈ మధ్య ఎందుకనో పాలిటిక్స్‌లో కూడా హుషారుగా ఉంటున్నారు. అప్పుడప్పుడూ పంచ్ డైలాగ్స్ వేస్తున్నారు. లోకేష్‌ను చంద్రబాబును వైసీపీ వాళ్ళు ఎన్నివిధాలా వెక్కిరించని బాలయ్య బాబు ఇప్పుడు మాత్రం గట్టిగానే పంచ్‌లు వేస్తున్నారు. వైసీపీ వాళ్ళను ర్యాగింగ్ చేస్తున్నారు.
హిందూపురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎనిమిదేళ్లుగా పదవిలో ఉంటూ వస్తున్న బాలయ్య (Nandamoori Balakrishna) నేడు గట్టిగా మాట్లాడారు. వైసీపీ వాళ్లకు నోట మాట రాకుండా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు బాలయ్య.
ఈ సందర్భంగా వైసీపీ సర్కారుపై ఆయన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత వైసీపీని తొక్కి పట్టి నార తీశారన్నారు. ఈ ఫలితాలు రాష్ట్రానికి టీడీపీ పాలనకు ఎంత అవసరమన్న విషయాన్ని తాజా ఫలితాలు స్పష్టం చేశాయని వ్యాఖ్యానించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలతో వైసీపీ కోటకు బీటలు పడుతున్నాయని.. పులివెందుల కోటకు మొదలైన బీటలు త్వరలో తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరుతాయన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి బాలయ్య (NBK) నోటి నుంచి ఆసక్తికరవ్యాఖ్య వచ్చింది. “ఇప్పుడు వై నాట్ 175” అని జగన్ నోటి నుంచి వస్తుంటే వినాలని ఉందన్న ఆయన మాటలు వైరల్ గా మారాయి. వై నాట్ 175 (Why not 175) అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలన్నది వైసీపీ ప్లాన్. దీంతో ఇప్పుడు ఆ వైసీపీ నినాదాన్ని వాళ్ళకే అప్పగిస్తూ ఇప్పుడు చెప్పండమ్మా వై నాట్ 175 అని అంటూ వాళ్లకు సవాల్ విసిరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram