నాని.. ఆశలన్నీ దసరా పైనే!

విధాత‌: నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో మొదటిసారి దసరా చిత్రంలో శ్రీకాంత్ ఓదెలా దర్శకంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. మార్చి 30న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. నేషనల్ లెవెల్‌లో ఆడియన్స్‌ను అలరించే కంటెంట్, స్టఫ్ ఈ సినిమాలో ఉన్నాయని నాని నమ్మకంగా చెబుతున్నాడు. గతంలో ఎన్నడూ చేయని ఒక ఊర మాస్ కథతో నాని నటిస్తూ ఈ సినిమాతో మాస్ హీరోగా […]

నాని.. ఆశలన్నీ దసరా పైనే!

విధాత‌: నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో మొదటిసారి దసరా చిత్రంలో శ్రీకాంత్ ఓదెలా దర్శకంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. మార్చి 30న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. నేషనల్ లెవెల్‌లో ఆడియన్స్‌ను అలరించే కంటెంట్, స్టఫ్ ఈ సినిమాలో ఉన్నాయని నాని నమ్మకంగా చెబుతున్నాడు.

గతంలో ఎన్నడూ చేయని ఒక ఊర మాస్ కథతో నాని నటిస్తూ ఈ సినిమాతో మాస్ హీరోగా ప్రమోట్ కావాలని చూస్తున్నారు. నేచురల్ స్టార్‌గా ఎదిగినా ఇంకా టైర్ 2 హీరోగానే పరిగణించ బడుతుండడంతో ఈ సినిమాతోనైనా తన రేంజ్‌ పెంచుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకే దసరా సినిమా ప్రతి విషయంలోనూ నాని ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తోంది.

నాని కెరీర్‌లోనే ఈ చిత్రం అత్యంత హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. నాని ఊర మాస్ యాటిట్యూడ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుండడంతో ఇప్పటివరకు నాని నటించిన ఏ సినిమాకు రాని బజ్ ఈ దసరా సినిమాకి వస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కువగా హింట్స్ ఇవ్వ‌కుండా జాగ్రత్త వహిస్తున్నారు.

కరోనా అనంతరం సౌత్ సినిమాలకు బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్, ఆద‌ర‌ణ ల‌భిస్తుండడంతో నాని తన దసరా సినిమాను అక్కడ కూడా బాగానే ప్రమోట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ధూమ్ ధామ్ సాంగ్ టీజర్‌తో శాంపిల్ చూపించగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. మరి నాని దసరా దుమ్ము దులిపేస్తుందా లేదా అనేది మార్చి 30న గాని చెప్పలేం.

ఇక ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్‌లో “వీర్లపల్లి.. చుట్టూరా బొగ్గు కుప్పలు.. తొంగి చూస్తే గానీ కనిపియ్యని ఊరు. మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటుపడిన సంప్రదాయం అనే డైలాగ్ తో పాటు “నీయవ్వ ఎట్లయితే గట్లాయె.. గుండు గుత్తగా లేపేద్దాం బాంచన్” అంటూ తెలంగాణ యాసలో డైలాగ్స్‌తో నాని అదరగొట్టారు.

టీజ‌ర్ చివ‌ర‌లో కత్తికి ఉన్న నెత్తుటితో నాని వీర తిలకం పెట్టుకున్న షాట్ నెక్ట్స్ లెవ‌ల్లో ఉంది. తెలంగాణ యాస‌తో నాని మాట్లాడిన తీరు, డైలాగ్స్ ప‌లికిన విధానం చూస్తే పుష్ప చిత్రంలో బ‌న్నీ చిత్తూరు మాండ‌లికానికి ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడో నాని తెలంగాణ యాస కోసం కూడా అంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని అర్ధం అవుతోంది.