Nara Rohit | పాత పుకారే.. కొత్తగా షికారు ! గుడివాడ నుంచి నారా రోహిత్ పోటీ?
Nara Rohit విధాత: పాత పుకారే.. కానీ మళ్ళీ కొత్తగా వినిపిస్తోంది.. నారా రోహిత్ రాజకీయాల్లోకి వస్తారు.. నేరుగా ఎన్నికల బరిలో దిగుతారు.. ఇదే పాత పుకారు.. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో పలు సోషల్ మీడియా గ్రూపుల్లో, వెబ్ సైట్లలో దర్శనం ఇస్తోంది. అయితే నేరుగా గుడివాడలో పోటీ చేస్తారని..కొడాలి నాని ని ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. రోహిత్ 2024 ఎన్నికల్లో టీడీపీ తరుపున గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని అంటున్నారు. వైసిపి పార్టీలో […]

Nara Rohit
విధాత: పాత పుకారే.. కానీ మళ్ళీ కొత్తగా వినిపిస్తోంది.. నారా రోహిత్ రాజకీయాల్లోకి వస్తారు.. నేరుగా ఎన్నికల బరిలో దిగుతారు.. ఇదే పాత పుకారు.. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో పలు సోషల్ మీడియా గ్రూపుల్లో, వెబ్ సైట్లలో దర్శనం ఇస్తోంది. అయితే నేరుగా గుడివాడలో పోటీ చేస్తారని..కొడాలి నాని ని ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు.
రోహిత్ 2024 ఎన్నికల్లో టీడీపీ తరుపున గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని అంటున్నారు. వైసిపి పార్టీలో ఉంటూ చంద్రబాబును నేరుగా ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉండే కొడాలి నాని ఇప్పటికే అక్కడి నుంచి నాలుగు సార్లు గెలిచారు. అక్కడ ఆయన చాలా బలంగా ఉన్నారు.
గత ఎన్నికల్లో ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ ఏకంగా వైసీపీ గూటికి చేరడంతో ఇక గుడివాడలో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి అభ్యర్థులు కరువయ్యారు.
ఒకదశలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినినీ బరిలోకి దించుతారని అనుకున్నా అది అయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఈసారి అక్కడ కాస్త సినిమా గ్లామర్ ఉన్న వాళ్ళను తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఇక్కడ్నుంచే 1983, 1985ల్లో రెండు సార్లు పోటీ చేసి గెలిచారు. ఇక కొడాలి నాని టీడీపీ నుంచి రెండు సార్లు..వైసిపి నుంచి రెండు సార్లు.. మొత్తం వరుసగా నాలుగు సార్లు గెలిచారు. ఆయన్ను ఓడించేందుకు టీడీపీ సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది.