Rave Party | మాదాపూర్‌లో రేవ్‌ పార్టీ భగ్నం నార్కోటిక్ బ్యూరో..! సినీ నిర్మాత సహా ఐదుగురు అరెస్ట్‌..!

అరెస్టయిన వారిలో సినీ ఫైనాన్సియర్ వెంకట్ గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో రేవ్ పార్టీలు Rave Party | విధాత, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసును నార్కోటిక్ బ్యూరో పోలీసులు వేగవంతం చేశారు. సినీ ఫైనాన్సియర్ వెంకట్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. బాలాజీ, కే వెంకటేశ్వర రెడ్డి, డీ మురళి, మధుబాల, మేహక్ అరెస్టయిన వారిలో ఉన్నారు. బాలాజీపై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. నార్కోటిక్ బ్యూరో పోలీసులు వెంకట్ కదిలికలపై […]

  • Publish Date - August 31, 2023 / 01:20 AM IST

  • అరెస్టయిన వారిలో సినీ ఫైనాన్సియర్ వెంకట్
  • గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో రేవ్ పార్టీలు

Rave Party | విధాత, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసును నార్కోటిక్ బ్యూరో పోలీసులు వేగవంతం చేశారు. సినీ ఫైనాన్సియర్ వెంకట్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. బాలాజీ, కే వెంకటేశ్వర రెడ్డి, డీ మురళి, మధుబాల, మేహక్ అరెస్టయిన వారిలో ఉన్నారు. బాలాజీపై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు.

నార్కోటిక్ బ్యూరో పోలీసులు వెంకట్ కదిలికలపై మూడు నెలలుగా నిఘా పెట్టారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో రేవ్ పార్టీలు నిర్వయిస్తున్నట్లు సమాచారంతో దాడులు చేశారు. వెంకట్ కు డ్రగ్స్ పెడలర్లతో సంబంధాలపై ఆరా తీశారు. అతని వాట్సప్ చాట్ లో డ్రగ్స్ పార్టీ పై చాటింగ్ చేసినట్లు నిర్ధారించారు. డమరుకం, పూల రంగుడు, లైవ్లీ, ఆటో నగర్ సూర్య సినిమాలకు వెంకట్ ఫైనాన్సియర్ గా వ్యవహరించారు

12 కేజీల గంజాయి పట్టివేత.. నలుగురిపై కేసు నమోదు

రంగారెడ్డి జిల్లా నార్సింగి చౌరస్తాలో గురువారం పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడింది. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులే టార్గెట్ గా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు నిఘా వేశారు. చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి ప్యాకింగ్ చేసి విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాడుల్లో 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేటుగాళ్లు అరకు నుంచి గంజాయి హైదరాబాద్ కు తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నలుగురి పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Latest News