National Award | జైభీమ్‌ కాదని.. ‘ద కశ్మీర్ ఫైల్స్’.. ఏ విధంగా జాతీయ సమగ్రత కేటగిరీలో ఉత్తమ చిత్రమైంది?

National Award | గురువారం (ఆగస్ట్ 24) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌‌పై బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఉత్తమ నటుడు అవార్డుకి టాలీవుడ్ నుంచి ‘పుష్ప’ సినిమాకిగానూ అల్లు అర్జున్‌ని సెలక్ట్ చేయడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం కరెక్ట్ చాయిస్ అంటూ.. జ్యూరీ‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ కరువు తీరిపోయేలా ఈసారి 11 నేషనల్ అవార్డులు తెలుగు సినిమా ఇండస్ట్రీని వరించాయి. ఈ అవార్డులు స్థాపించిన […]

  • By: krs    latest    Aug 28, 2023 2:03 AM IST
National Award | జైభీమ్‌ కాదని.. ‘ద కశ్మీర్ ఫైల్స్’.. ఏ విధంగా జాతీయ సమగ్రత కేటగిరీలో ఉత్తమ చిత్రమైంది?

National Award |

గురువారం (ఆగస్ట్ 24) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌‌పై బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఉత్తమ నటుడు అవార్డుకి టాలీవుడ్ నుంచి ‘పుష్ప’ సినిమాకిగానూ అల్లు అర్జున్‌ని సెలక్ట్ చేయడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం కరెక్ట్ చాయిస్ అంటూ.. జ్యూరీ‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ కరువు తీరిపోయేలా ఈసారి 11 నేషనల్ అవార్డులు తెలుగు సినిమా ఇండస్ట్రీని వరించాయి.

ఈ అవార్డులు స్థాపించిన ఈ 69 ఏళ్లలో ఇన్ని అవార్డులు టాలీవుడ్‌కి రావడం ఇదే ప్రథమం. అలాగే కీరవాణి, వాళ్లబ్బాయ్ కాలభైరవకు.. అంటే ఒకేసారి తండ్రీకొడుకులకు అవార్డ్ రావడంపై కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.

ఇది ఒక రికార్డ్ కూడా. సరే ఇదంతా ఇలా ఉంటే.. మరీ ముఖ్యంగా సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా విషయంలో మాత్రం పెద్ద కాంట్రవర్సీనే నడుస్తుంది. ఈ సినిమాని అస్సలు కన్సిడర్ చేయకపోవడంపై కోలీవుడ్ నుంచే కాకుండా.. ఇండియాలోని అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి ఈ అవార్డులపై వ్యతిరేకత కనిపిస్తుంది.

సోషల్ మీడియా వేదికగా.. ‘జై భీమ్’కి అన్యాయం చేశారంటూ.. డైరెక్ట్‌గానే కొందరు నెటిజన్లు నేషనల్ అవార్డు కమిటీని టార్గెట్ చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి కూడా కొందరు ఈ విషయంలో సపోర్ట్‌గా నిలబడటం విశేషం. మరీ ముఖ్యంగా న్యాచురల్ స్టార్ నాని కూడా ‘జై భీమ్’ అని టైప్ చేసి.. హార్ట్ బద్దలైన ఎమోజీని పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ విషయంలో నానిని కూడా కొందరు ట్రోల్ చేస్తున్నారు. బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్‌కి వచ్చిందని కుళ్లుకుంటున్నాడనేలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాని ఉద్దేశ్యం మాత్రం బెస్ట్ యాక్టర్ అని కాదు కానీ.. ఏదో ఒక కేటగిరీలో ఆ సినిమాకు గుర్తింపు ఇవ్వలేదనే కోణం మాత్రం కనబడుతుంది.

ఇక ఇదే విషయంపై కొందరు అవార్డు వచ్చిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. నర్గీస్ దత్ జాతీయ సమగ్రతా చిత్రం కేటగిరీలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి అవార్డును ప్రకటించారు. అసలు ఏ విధంగా ఈ సినిమా జాతీయ సమగ్రతా చిత్రం అవుతుంది? అని ప్రశ్నిస్తున్నారు.

జాతీయ సమగ్రత అంటే.. అన్ని వర్గాలను ఆకర్షించిన, మెచ్చిన చిత్రంగా ఉండాలి. కానీ అది కేవలం కశ్మీర్ పండిట్‌ల బాధలను తెలియజేసే చిత్రం మాత్రమే.. అంటే హిందువులకు సపోర్ట్‌గా నిలిచే చిత్రం. అందుకే ఈ సినిమాకు అవార్డ్ వచ్చేలా బీజేపీ వెనుక కథ నడిపిందని అంతా అనుకుంటున్నారు.

మొదటి నుంచి ఈ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇస్తూ వచ్చింది. మోడీ, అమిత్ షా, యోగి వంటి వారంతా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆఫ్ కోర్స్ ప్రేక్షకులు కూడా ఆదరించారనుకోండి. కానీ, జాతీయ సమగ్రతను నిలబెట్టే చిత్రంగా అన్ని క్వాలీటీస్ ఉన్న చిత్రం మాత్రం ‘జై భీమ్’ అనే చెప్పాలి.

అణగారిన వర్గాల వారికి అండగా నిలబడిన ఓ నిజ జీవిత ప్లీడర్ బయోపిక్ అది. కానీ.. కనీస గుర్తింపు కూడా ఆ చిత్రానికి ఇవ్వలేదు. కారణం ఏమై ఉంటుందనేది పక్కన పెడితే.. ఈ అవార్డులలో లాబీయింగ్ జరిగిందనేది మాత్రం ‘జై భీమ్’ విషయంలో స్పష్టమవుతుందనేది మాత్రం కాదనలేని సత్యం.