Maheshwar Reddy | క్షీణించిన మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం
నాలుగో రోజూ కొనసాగిన నిరవధిక నిరశన దీక్ష నిర్మల్ మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్ రద్దుకు డిమాండ్ రైతులు, బీజేపీ శ్రేణుల సంఘీభావం Maheshwar Reddy | విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్, జీఓ 220 రద్దు డిమాండ్ తో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరశన దీక్ష శనివారం నాలుగో రోజూ కొనసాగింది. దీక్ష చేపట్టిన మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి […]

- నాలుగో రోజూ కొనసాగిన నిరవధిక నిరశన దీక్ష
- నిర్మల్ మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్ రద్దుకు డిమాండ్
- రైతులు, బీజేపీ శ్రేణుల సంఘీభావం
Maheshwar Reddy | విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్, జీఓ 220 రద్దు డిమాండ్ తో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరశన దీక్ష శనివారం నాలుగో రోజూ కొనసాగింది. దీక్ష చేపట్టిన మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తున్నది. డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. బీపీ, షుగర్ లెవెల్స్, పల్స్ రేటు పడిపోయాయని తెలిపారు. దీక్ష ఇంకా కొనసాగించినట్లయితే ఆరోగ్యం మరింత విషమిస్తుందని డాక్టర్లు పేర్కొన్నారు .
మహేశ్వర్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరశన దీక్ష శిబిరానికి రైతులు, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. మాస్టర్ ప్లాన్ పేరిట రైతుల భూములు అక్రమంగా లాక్కుంటున్నారని, మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకూ నిరవధిక నిరశన దీక్షను కొనసాగించనున్నట్లు శిబిరం వద్ద ఏలేటి స్పష్టం చేశారు.