CM Nitish Kumar | బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ ఆదివారం రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు తన రాజీనామాను అందజేశారు. బీజేపీ మద్దతు ఆయన సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నితీశ్ కొత్త ప్రమాణ స్వీకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరుగనున్నది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి నితీశ్ ‘రాష్ట్రంలో మహాఘట్‌బంధన్‌తో సంబంధాలను తెంచుకోవాలని తాము నిర్ణయించుకున్నామని’ చెప్పారు.
అయితే, మహాకూటమి ప్రభుత్వం పాలనకు ముగింపుతూ పలుకుతూ నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA)లో తిరిగి చేరుతారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఊహించిన విధంగానే బిహార్‌లో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలకు మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మత శక్తుల’పై తన పోరాటం మరణం వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కూటమికి షాక్..
నితీశ్‌కుమార్ కూటమి మార్చడం ఇది నాలుగోసారి. బీహార్ అసెంబ్లీలో 243, ఆర్‌జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాతి స్థానంలో బీజేపీ 78, జేడీయూకి 45, కాంగ్రెస్‌కి 19, సీపీఐ 12, సీపీఎం 2 చొప్పున, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) 4 నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో రెండింటిలో ఎంఐఎంకి ఒకటి, మరొకరు స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో నితీశ్‌కుమార్ కీలకంగా వ్యవహరించారు.
కాగా.. ఆయన కూటమి నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్‌కు మింగుడుపడని విషమే. మరో వైపు కూటమిలో పార్టీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర్యంగా పోటీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్ స్పష్టం చేశారు. ఇండియా కూటమిలోని పార్టీలు వరుసగా షాక్ ఇస్తున్నాయి. కేరళలోని సీపీఐ ఎం పార్టీ సైతం అదే బాటలో పయనించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
అసెంబ్లీలో బలాబలాలు..
బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగ 79 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 122 సీట్లు అవసరమువతాయి. ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 43 మంది సభ్యులు కావాల్సి ఉంటుంది. మరోవైపు 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీ ఉన్నది. జేడీయూకు 45 మంది సభ్యులున్నారు.
నీతీశ్ బీజేపీతో కలిస్తే వారి కూటమికి 123 మందికి ఎమ్మెల్యేల బలం చేరుతుంది. ఈ సంఖ్య ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోతుంది. నలుగురు సభ్యులున్న హిందూస్థానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) సైతం బీజేపీకి మద్దతు తెలుపుతున్నది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఇప్పటికే నితీశ్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఆర్జేడీ మంత్రుల స్థానంలో బీజేపీ సభ్యులు ప్రమాణం చేసే అవకాశం ఉన్నది.
ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ఇంకా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కావాలి. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇప్పటికే సైతం కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని సంకేతాలివ్వగా.. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ఆ కూటమికి 114 మంది సభ్యుల బలం ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం కావాలి. ఇతర పార్టీల నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటారా? చూడాలి మరి.