Eetala | బీఏసీకి పిల‌వ‌ట్లే: ఎమ్మెల్యే ఈట‌ల ఆగ్ర‌హం

Eetala | విధాత, హైదరాబాద్: బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించక పోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క సభ్యుడున్న లోక్ సత్తాను కూడా బీఏసీకి పిలిచే వారని గుర్తుచేశారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు సభ్యులున్న బీజేపీకి బీఏసీ భేటీకి ఆహ్వానం లేదన్నారు. గతంలో శాసనసభ ఆవరణలో అన్ని పార్టీలకు ఆఫీసుల […]

Eetala | బీఏసీకి పిల‌వ‌ట్లే: ఎమ్మెల్యే ఈట‌ల ఆగ్ర‌హం

Eetala |

విధాత, హైదరాబాద్: బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించక పోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క సభ్యుడున్న లోక్ సత్తాను కూడా బీఏసీకి పిలిచే వారని గుర్తుచేశారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు సభ్యులున్న బీజేపీకి బీఏసీ భేటీకి ఆహ్వానం లేదన్నారు. గతంలో శాసనసభ ఆవరణలో అన్ని పార్టీలకు ఆఫీసుల కోసం గదులు ఉండేవని, ప్రస్తుతం మాకు శాసనసభాపక్షం కార్యాలయం కూడా ఇవ్వలేదని వాపోయారు.

ఇది అత్యంత అవమానకర చర్యగా భావించాలన్నారు. ఇవాళ ఉదయం స్పీకర్‌కు ఫోన్ చేసి తాము ఎక్కడుండాలని అడిగితే స్పందన లేదన్నారు. నిజాం క్లబ్‌లో కూర్చొని సమావేశాలకు రావాల్సి వచ్చిందన్నారు. మూడు రోజులు మాత్రమే సభను జరపటం సిగ్గుచేటన్నారు.

6 నెలలకు ఒకసారి సభ జరగాలి కాబట్టి నిర్వహిస్తున్నారు తప్ప ప్రభుత్వానికి ప్రజా సమస్యలు చర్చించాలన్న సోయి లేదని విమర్శించారు. వరదలతో లక్షల ఎకరాల పంట పొలాలు మునిగిపోయాయని ప్రజలు, పశువులు కొట్టుకుపోయాయని తెలిపారు. ప్రభుత్వం కనీసం బాధితులకు నిత్యావసర సరుకులు ఇవ్వలేదని ఎమ్మెల్యే విమర్శించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామని, వారి దుఃఖం వర్ణనాతీతమన్నారు. ఇళ్లలోకి వరదొచ్చిన వారికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టం జరిగిన నేపథ్యంలో రైతులకు పరిహారం అందించాలని చెప్పామన్నారు. తానే ఇంజనీరింగ్‌గా కాళేశ్వరం నిర్మించానని ముఖ్యమంత్రి చెప్పారని, ఇవాళ మంచిర్యాల పట్టణం మునిగిపోయిందని తెలిపారు. వేలాది ఎకరాల పంట పొలాలు మునిగిపోయాయన్నారు.

ఈ ప్రాజెక్టు కట్టకముందు సుభిక్షంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారన్నారు. రైతు ఏడుస్తున్నాడని, సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. బీజేపీ శాసనసభ పక్షం తరపున కేంద్ర బృందాన్ని కలుస్తామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని సంబుర పడుతున్నారని, ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునే కుట్ర జరుగుతోందని తెలుస్తోందన్నారు. మల్టిపర్పస్ అని చెప్పి ఊడ్చేవాళ్లని కూడా ట్రాక్టర్ నడపాలని చిల్లర నిబంధనలు పెట్టారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.