విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ ఛైర్మెన్ వెన్ రెడ్డి రాజుపై అవిశ్వాస తీర్మానం కోసం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అసమ్మతి కౌన్సిలర్లు నోటీసు అందించారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లలో అవిశ్వాసానికి 17 మంది మద్దతు ఇస్తున్నారు.
వారిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు, బీజేపీ పార్టీ నుంచి ఎనిమిది మంది కౌన్సిలర్లు, సీపీఎం పార్టీ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారు. 14మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కు ఆవిశ్వాసం ప్రతిపాదిస్తూ సంతకాలతో కూడిన నోటీసును అందజేశారు.