ప్రేమ వద్దు.. ఓన్లీ సెలబ్రేషన్స్: నెట్టింట రచ్చ చేస్తోన్న సురేఖా వాణి, ఆమె కుమార్తె
విధాత: సురేఖ వాణి.. ఈ విజయవాడ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ‘బొమ్మరిల్లు’తో పాటు బాద్‌షా, నాయక్, నిప్పు, వీడు తేడా, నమో వెంకటేశా.. వంటి చిత్రాలలో వదిన, అక్క, మరదలు, కోడలు వంటి క్యారెక్టర్స్‌లతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే సినిమాలలో సాత్విక పాత్రలలో కనిపించే ఆమె బయట మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే సురేఖ ప్రేమ వివాహం చేసుకోగా కొంతకాలం క్రితం అనారోగ్య […]

విధాత: సురేఖ వాణి.. ఈ విజయవాడ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ‘బొమ్మరిల్లు’తో పాటు బాద్‌షా, నాయక్, నిప్పు, వీడు తేడా, నమో వెంకటేశా.. వంటి చిత్రాలలో వదిన, అక్క, మరదలు, కోడలు వంటి క్యారెక్టర్స్‌లతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే సినిమాలలో సాత్విక పాత్రలలో కనిపించే ఆమె బయట మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది.
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే సురేఖ ప్రేమ వివాహం చేసుకోగా కొంతకాలం క్రితం అనారోగ్య సమస్యలతో మరణించారు. అప్పటినుంచి కూతురితో కలిసి ఒంటరిగానే ఉంటుంది. తర్వాత సినిమా అవకాశాలు కూడా కాస్త తక్కువగా ఉండడంతో పెళ్లీడుకొచ్చిన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.
కూతురుతో కలిసి ఇంట్లో డాన్సులు చేయడం, యోగా చేయడం, చిట్టి పొట్టి డ్రెస్‌లతో పార్టీలకు వెళ్తూ ఆ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకంటూ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
రీసెంట్‌గా వాలెంటైన్స్‌డే సందర్భంగా సురేఖ వాణి తన కూతురితో కలిసి వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ బీచ్‌లో తన కుమార్తెతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలకి మంచి కామెంట్ కూడా జత చేసింది సురేఖా వాణి.. అందులో హ్యాపీ వాలెంటైన్స్ డే గైస్.. మీ జీవితాన్ని ప్రేమ కోసం పాడు చేసుకోకండి అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఒకవైపు గ్లామర్‌గా ఉన్న కుమార్తె ఫొటోను షేర్ చేస్తూనే మరోపక్క ప్రేమ కోసం జీవితాన్ని పాడు చేసు కోవద్దని చెప్పడంతో సురేఖ వాణి షేర్ చేసిన ఫొటో, కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఆ కామెంట్‌ను ఎందుకు చేసి ఉంటుంది? దాని ఉద్దేశం ఏమిటి? అనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.