Tirumala: ఇకపై.. తిరుమల అన్న ప్రసాదంలో గారె!

TTD | Anna Prasadam
విధాత, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ(TTD) తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం (Anna Prasadam)భోజనం ఎంతో ప్రితీపాత్రం. వెంకన్న లడ్డూ మాదిరిగానే అన్న ప్రసాద భోజనాన్ని కూడా భక్తులు పవిత్రంగా భావిస్తుంటారు. సూదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చడంతో టీటీడీ వెంగమాంబ అన్నదాన సత్రంలో అందించే రుచికర భోజనం ఎంతగానో ప్రసిద్ధి. కొత్తగా అన్నప్రసాదం మెనూలో గారె(GARE) కూడా భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం పట్ల భక్తులలో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.
టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు(Chairman B.R. Naidu)అన్న ప్రసాదం మెనూ లో గారెను కూడా ప్రవేశపెట్టినట్లుగా వెల్లడించారు. టీటీడీ చైర్మన్ గా తాను అన్న ప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థంపెట్టాలని ఆలోచన నాకు కలిగిందని..నా ఆలోచనను సీఎం దృష్టికి తీసుకెళ్లానని.. ఆయన అంగీకారంతో గారెలనుఇవాళ ప్రవేశపెట్టామని నాయుడు వెల్లడించారు.
నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను మా అధికారులు వడ్డిస్తున్నారన్నారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 4గంటల వరకు ప్రతిరోజు 35 వేల గారెలను భక్తులకు వడ్డిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి, భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని బీ.ఆర్.నాయుడు పేర్కొన్నారు.