టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్ లవ్ బ్రేకప్ స్టోరీ.. బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చానంటూ కామెంట్

మాస్ మహరాజా రవితేజ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషనల్ స్పీడ్ పెంచారు. రీసెంట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పలు ఆసక్తికర విషయాలు తెలియజేసింది.
వంశీ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. ఖేర్, మురళీ శర్మ, సుదేవ్ నాయర్, రేణు దేశాయ్, నాజర్, అనుక్రీతి, హరీష్ పెరడి, జిషు సేన్‌గుప్తా సహా చాలా మంచి నటినటులు ఈ చిత్రంలో నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందించగా, ఆయన బాణీలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
చిత్రంలో కథానాయికగా నటించిన నుపుర్ సనన్ ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటోంది. నాలుగు రోజుల్లో సినిమా రాబోతుడటంతో ఇంటర్వ్యూలు, ఈవెంట్లకు హాజరవుతూ అందరి దృష్టిని తనపై పడేలా చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నుపుర్ సనన్ తన లవ్ బ్రేకప్ స్టోరీని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఆమె ప్రేమ విఫలమైందంటూ చెప్పుకొచ్చిన ఈ భామ ఆ తర్వాత కథని కూడా తెలియజేసింది. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒకబ్బాయిని చాలా ఇష్టపడిందట. ఎంతో గాఢంగా కూడా ప్రేమించిందట. పీకల్లోతు ప్రేమలో మునిగిపొయానని చెప్పిన ఈ భామ అతనిని గుడ్డిగా నమ్మి మోసపోయిందట.
లవ్ ఫెయిల్ అయినప్పుడు ఆ బాధ తట్టుకోలేకపోయాను అని పేర్కొంది నుపుర్. నా లవ్ ఫెయిల్ అయ్యాక బాత్ రూంలోకి వెళ్లి మరీ ఏడ్చాను. అర్ధరాత్రి వెక్కివెక్కి ఏడ్చి చాలా బాధపడ్డాను. ఈ విషయం ఇంట్లో వాళ్లకి తెలియదు. అయితే ఆ బాధ నుండి బయటపడడానికి చాలా సమయం పట్టిందని కూడా పేర్కొంది.
మొత్తానికి నుపుర్ తన లవ్ బ్రేకప్ స్టోరీ చెప్పి కాస్త సింపతీ కూడా కూడగట్టుకుంది. ఇక ఈ భామ ‘టైగర్ నాగేశ్వర రావు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రెడిషనల్ లుక్ లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుపుర్‌కి తొలి సినిమా కాగా, ఈ సినిమా హట్ అయితే మాత్రం అమ్మడికి వరుస ఆఫర్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.