Odisha | అట‌వీ అధికారిని కాల్చి చంపిన వేట‌గాళ్లు

Odisha ఒడిశాలోని సిమిలిపాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో దారుణం నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ఇది రెండో ఘ‌ట‌న‌ విధాత‌: ఒడిశాలో వ‌న్య‌ప్రాణుల వేట‌గాళ్లు రెచ్చిపోతున్నారు. త‌మ ఆగ‌డాల‌ను అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారుల‌ను కాల్చి చంపుతున్నారు. శనివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో వేటగాళ్ల గుంపును అడ్డుకొని, ఆయుధాలను స్వాధీనం చేసుకుంటుండ‌గా, వేటగాళ్లలో ఒకడు ఓ ఫారెస్ట్ అధికారిని కాల్చిచంపాడ‌ని అధికారులు వెల్ల‌డించారు. ఘట‌న ఎక్క‌డంటే.. మయూర్‌భంజ్ జిల్లాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని గమ్‌చాచరణ్ బీట్ క్యాంపు […]

Odisha | అట‌వీ అధికారిని కాల్చి చంపిన వేట‌గాళ్లు

Odisha

  • ఒడిశాలోని సిమిలిపాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో దారుణం
  • నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ఇది రెండో ఘ‌ట‌న‌

విధాత‌: ఒడిశాలో వ‌న్య‌ప్రాణుల వేట‌గాళ్లు రెచ్చిపోతున్నారు. త‌మ ఆగ‌డాల‌ను అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారుల‌ను కాల్చి చంపుతున్నారు. శనివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో వేటగాళ్ల గుంపును అడ్డుకొని, ఆయుధాలను స్వాధీనం చేసుకుంటుండ‌గా, వేటగాళ్లలో ఒకడు ఓ ఫారెస్ట్ అధికారిని కాల్చిచంపాడ‌ని అధికారులు వెల్ల‌డించారు.

ఘట‌న ఎక్క‌డంటే..

మయూర్‌భంజ్ జిల్లాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని గమ్‌చాచరణ్ బీట్ క్యాంపు సమీపంలో గిరిజన అటవీ అధికారి మతి హన్స్‌దా, ఇతర అధికారులతో కలిసి పెట్రోలింగ్ చేప‌ట్టారు. శనివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో వేటగాళ్ల గుంపును అడ్డగించారు. వారు ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్ర‌మంలో వేటగాళ్లలో ఒకడు అధికారి మతి హన్స్‌దాను తుపాకీతో కాల్చాడు. వెంటనే ఆయ‌న‌ను కరంజియా ద‌వాఖాన‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

గ‌త నెల‌లో ఒక‌రి హ‌త్య‌

వేటగాళ్ల చేతిలో ఓ ఫారెస్ట్‌ అధికారి హత్యకు గురికావడం నెల రోజుల్లో ఇది రెండోసారి. మే 22 సాయంత్రం, ఫారెస్ట్ గార్డు బిమల్ కుమార్ జెనాను 26 మంది వేటగాళ్ల బృందం టైగర్ రిజర్వ్‌లోని కోర్ ఏరియాలో కాల్చి చంపింది. తాజా ఘటనపై కేసు నమోదు చేశామని డిప్యూటీ డైరెక్టర్ (సిమిలిపాల్ నార్త్ డివిజన్) సాయి కిరణ్ తెలిపారు.