ODISHA | ఒడిశాలో విషాదం.. పాముకాటుకు ముగ్గురు విద్యార్థులు బలి
ODISHA | ఒడిశాలోని కోయింజార్ జిల్లాలో విషాదం నెలకొంది. ఓ ప్రయివేటు హాస్టల్‌లో నిద్రిస్తున్న నలుగురు పిల్లలను పాము కాటేసింది. దీంతో ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కోయింజార్ జిల్లా నిశ్చింతపూర్ గ్రామంలో విద్యార్థులకు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ, ప్రయివేటు హాస్టల్ కూడా నడుపుతున్నాడు ఓ వ్యక్తి. అయితే శనివారం రాత్రి హాస్టల్‌లో నలుగురు విద్యార్థులు నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి వేళ ఆ నలుగురిని పాము కాటేసింది. నొప్పిగా అనిపించడంతో […]

ODISHA |
ఒడిశాలోని కోయింజార్ జిల్లాలో విషాదం నెలకొంది. ఓ ప్రయివేటు హాస్టల్‌లో నిద్రిస్తున్న నలుగురు పిల్లలను పాము కాటేసింది. దీంతో ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. కోయింజార్ జిల్లా నిశ్చింతపూర్ గ్రామంలో విద్యార్థులకు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ, ప్రయివేటు హాస్టల్ కూడా నడుపుతున్నాడు ఓ వ్యక్తి.
అయితే శనివారం రాత్రి హాస్టల్‌లో నలుగురు విద్యార్థులు నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి వేళ ఆ నలుగురిని పాము కాటేసింది. నొప్పిగా అనిపించడంతో విద్యార్థులకు మెలకువ వచ్చింది. అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది.. నలుగురు విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు విద్యార్థులు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.
మృతులను రాజా నాయక్(12), ఎలినా నాయక్(12), సేహశ్రీ నాయక్(11)గా పోలీసులు గుర్తించారు. ఆకాశ్ నాయక్(12) అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.