• Telugu News
  • /National

Lagnesh Kumar | చూపులేక‌పోయినా.. లా చ‌దివి ప్రాక్టీస్ చేస్తున్నాడు.. దృష్టిలోపం ఉన్న తొలి న్యాయవాదిగా..

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని బిలాస్‌పూర్ (Bilaspur) జిల్లా నివాసి లగ్నేష్ కుమార్ (Lagnesh Kumar).. చూపు లేక‌పోయినా ప‌ట్టుద‌ల‌తో క‌ష్ట‌ప‌డి లా చ‌దివాడు. గ‌త రెండేళ్లుగా ఘుమార్విన్ సివిల్ కోర్టు (Ghumarwin Civil Court)లో లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ల‌గ్నేష్.. హిమాచల్‌ న్యాయచరిత్రలో వంద శాతం దృష్టిలోపం ఉన్న తొలి న్యాయవాదిగా (Himachal's first visually impaired lawyer) గుర్తింపు పొందాడు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 09, 2026, 2:37 pm IST
Read Time: 5 mins
Lagnesh Kumar | చూపులేక‌పోయినా.. లా చ‌దివి ప్రాక్టీస్ చేస్తున్నాడు.. దృష్టిలోపం ఉన్న తొలి న్యాయవాదిగా..

Lagnesh Kumar | ఓ యువ‌కుడు జీవితంపై ఎన్నో క‌ల‌లు క‌న్నాడు. అనుకున్న‌ది సాధించి త‌న త‌ల్లిని బాగా చూసుకోవాల‌ని ఆశ‌ప‌డ్డాడు. అయితే, విధి వెక్కిరించింది. కంటి సంబంధ ఇన్‌ఫెక్షన్‌ (Eye infection) అత‌డి జీవితాన్నే త‌ల కింద‌లు చేసింది. అయినా వెన‌క‌డుగు వేయ‌లేదు. ప‌ట్టుద‌ల‌తో ల‌క్ష్యంవైపు అడుగులు వేశాడు. ఫ‌లితం.. అతడి సంకల్పం ముందు అంధత్వం ఓడిపోయింది. పట్టుదలతో లా చదివి (Himachals first visually impaired lawyer) ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాడు. ఏదైనా సాధించాలనే తపన ఉంటే ఎలాంటి క‌ష్ట‌మైనా మ‌న‌ల్ని ఆప‌లేద‌ని నిరూపించాడు. అత‌డే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని బిలాస్‌పూర్ (Bilaspur) జిల్లా నివాసి లగ్నేష్ కుమార్ (Lagnesh Kumar).

2009లో చూపు కోల్పోయి..

బిలాస్‌పుర్‌ జిల్లా ఘుమార్విన్‌ (Ghumarvin) సబ్‌డివిజన్‌లోని బరోటా (Barota) గ్రామానికి చెందిన 33 ఏళ్ల‌ ల‌గ్నేష్‌ కుమార్ (Lagnesh Kumar)కు న్యాయ‌వాది కావాల‌న్న కోరిక ఉంది. అందుకోసం క‌ష్ట‌ప‌డి చ‌దివాడు. అయితే, విధి వెక్కిరించింది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కార‌ణంగా 2009లో అత‌డు చూపు కోల్పోయాడు. తండ్రి లేడు. తల్లి ఓ అంగన్‌వాడీ కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తోంది. ఎన్నో కష్టాలు పడి న్యాయవాది కావాలన్న కుమారుడిని చ‌దివించింది. 2016లో ఘుమార్విన్ కళాశాల నుంచి ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రుడయ్యాడు.

ఢిల్లీ వ‌ర్సిటీలో న్యాయ‌విద్య పూర్తి చేసి

గ్రాడ్యుయేషన్ తర్వాత లగ్నేష్ 2016లో ఢిల్లీ యూనివర్సిటీ లా కోర్సులో చేరాడు. 2020లో త‌న న్యాయ‌విద్య‌ను పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత‌ లగ్నేష్ కుమార్ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. ఇక‌ గత రెండేళ్లుగా.. ఘుమార్విన్ సివిల్ కోర్టు (Ghumarwin Civil Court)లో లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దృష్టి లోపం ఉన్నప్పటికీ బ్రెయిలీ లిపితోపాటు సాంకేతికత, సహాయ పరికరాల సాయంతో తన వృత్తిలో రాణిస్తున్నారు. కోర్టులో వాద‌న‌లు వినిపిస్తూ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు.

వంద‌శాతం దృష్టిలోపం ఉన్న తొలి న్యాయ‌వాదిగా..

“2009లో తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్ కారణంగా నేను నా కంటి చూపును కోల్పోయాను. మొద‌ట్లో నా కళ్ళు ఎర్రగా మారిపోయాయి. దీంతో నేను స్థానికంగా చికిత్స తీసుకున్నా. అక్కడి వైద్యులు దానిని అలెర్జీగా నిర్ధారించారు. ఆ త‌ర్వాత‌ సిమ్లా సహా అనేక ప్రదేశాల్లో కంటి ప‌రీక్ష‌లు చేయించుకున్నా. కానీ చివరికి నేను కంటి చూపుకోల్పోవాల్సి వ‌చ్చింది. 2009లో పూర్తిగా అంధుడినయ్యాను” అని ల‌గ్నేష్ చెప్పుకొచ్చాడు. ల‌గ్నేష్.. హిమాచల్‌ న్యాయచరిత్రలో వంద శాతం దృష్టిలోపం ఉన్న తొలి న్యాయవాదిగా (Himachal’s first visually impaired lawyer) గుర్తింపు పొందాడు.

ఇవి కూడా చదవండి :

Srisailam : శ్రీశైలంలో శివదీక్ష భక్తుల నిరసన
Sai Dhansika | నా వాళ్లపై చేయి వేసినా ఊరుకోను .. ఆకతాయిల‌కి ఝ‌ల‌క్ ఇచ్చిన క‌బాలి న‌టి