భార్య దారుణ హత్య.. ఆమె తలతో పోలీసు స్టేషన్‌కు భర్త
వివాహేతర సంబంధం అనుమానంతో ఓ భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమెను తలను మొండెం నుంచి వేరు చేశాడు

భువనేశ్వర్: వివాహేతర సంబంధం అనుమానంతో ఓ భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమెను తలను మొండెం నుంచి వేరు చేశాడు. అనంతరం తలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు భర్త. ఈ దారుణ ఘటన ఒడిశాలోని నయాగర్హ్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నయాగర్హ్ జిల్లాలోని బిడపాజు గ్రామానికి చెందిన అర్జున్ బాగా(35) కొన్నేండ్ల క్రితం ధరిత్రి(30) అనే మహిళను వివాహం చేసుకున్నాడు.
అయితే భార్య ధరిత్రి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అర్జున్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన భర్త.. భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. మొండెం నుంచి తలను వేరు చేశాడు. అనంతరం భార్య తలను తీసుకొని నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు అర్జున్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధరిత్రి మొండెంను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్జున్‌ను రిమాండ్‌కు తరలించారు.