KTR VS BANDI: మరోసారి కేటీఆర్.. సంజయ్‌ల ట్విట్టర్ వార్

విధాత: మంత్రి కేటీఆర్‌కు, బీజేపీపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ్‌కి మధ్య మరోసారి ట్విట్టర్ వేదికగా పరస్పర విమర్శల దాడి సాగింది . తెలంగాణ బీజేపీ ఎంపీలకు వెన్నుముక లేదని కేటీఆర్ ట్విట్టర్లో విమర్శించారు. రాష్ట్ర పున వ్యవస్థీకరణ చట్టం హామీలను మోడీ సర్కారు ఉల్లంఘించిందని, దీనికి వెన్నుముకలేని ఆ నలుగురు ఎంపీలు బాధ్యత వహించాలన్నారు. తెలంగాణకు… కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధానిపసుపు బోర్డు ఇవ్వం - ప్రధానిమెట్రో రెండో దశ ఇవ్వం - ప్రధాని […]

  • Publish Date - March 30, 2023 / 01:00 PM IST

విధాత: మంత్రి కేటీఆర్‌కు, బీజేపీపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ్‌కి మధ్య మరోసారి ట్విట్టర్ వేదికగా పరస్పర విమర్శల దాడి సాగింది . తెలంగాణ బీజేపీ ఎంపీలకు వెన్నుముక లేదని కేటీఆర్ ట్విట్టర్లో విమర్శించారు. రాష్ట్ర పున వ్యవస్థీకరణ చట్టం హామీలను మోడీ సర్కారు ఉల్లంఘించిందని, దీనికి వెన్నుముకలేని ఆ నలుగురు ఎంపీలు బాధ్యత వహించాలన్నారు.

తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు కానీ గుజరాత్ కు మాత్రం 20 వేల కోట్ల లోగోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చారన్నారు. గుజరాత్ బాసులకు చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్న ఫలితం ఇది.. మోడీ ప్రాధాన్యతలో తెలంగాణ లేదు ..తెలంగాణ ప్రజల ప్రాధాన్యతలో మోడీ ఎందుకు అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కు మాలిన పార్టీ ఎందుకు ఉండాలంటు ట్విట్ చేశారు.

అంతకుముందు బండి సంజయ్ తన ట్విట్టర్లో సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేశారు. దేశంలోనే అత్యధిక పెయిడ్ సీఎం కేసీఆర్ నెలకు 4.1లక్షలు వేతనం, కేసీఆర్ కొడుకు ఇమేజ్ వర్త్ 100 కోట్లు, కేసిఆర్ కూతురు వాచ్ ధర 20 లక్షలు.. మరి కుక్కల బారినబడ్డ పిల్లల, ర్యాగింగ్, రేప్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ బాధితుల ధరెంత..? దొరవారి గడీలలో నలిగిపోయిన న్యాయమా..? అంటూ ట్విట్ చేశారు.