Telangana | వైన్ షాపులకు 1.31 లక్షల దరఖాస్తులు.. 21న లాటరీ పద్ధతిలో కేటాయింపు
Telangana | తెలంగాణలో కొత్త మద్యం విధానానికి అనూహ్య స్పందన లభించింది. ఎవరూ ఊహించని విధంగా.. 2,620 మద్యం దుకాణాలకు గానూ 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. గతంలో కేవలం 69 వేల దరఖాస్తులు రాగా, ఈ సారి గరిష్ఠంగా లక్ష వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. కానీ చివరి రెండు రోజుల్లోనే 87 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రాజకీయ ప్రముఖులు కూడా […]
Telangana |
తెలంగాణలో కొత్త మద్యం విధానానికి అనూహ్య స్పందన లభించింది. ఎవరూ ఊహించని విధంగా.. 2,620 మద్యం దుకాణాలకు గానూ 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. గతంలో కేవలం 69 వేల దరఖాస్తులు రాగా, ఈ సారి గరిష్ఠంగా లక్ష వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు.
కానీ చివరి రెండు రోజుల్లోనే 87 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రాజకీయ ప్రముఖులు కూడా మద్యం వ్యాపారంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే భారీగా దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. ఇక దరఖాస్తులకు డీడీలు తీసేందుకు వ్యాపారులు.. దాచి ఉంచిన రూ. 2 వేల నోట్లను పెద్ద మొత్తంలో వినియోగించినట్లు తెలిసింది.
ఈసారి అత్యధికంగా సరూర్‌నగర్‌లో 10,908, శంషాబాద్ లో 10,811 దరఖాస్తులు రాగా, అతి తక్కువగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 967, ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 979మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. ఈ నెల 21న లాటరీ పద్ధతిలో మద్యంషాపులను కేటాయించనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram