పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు.. ఒకరు సజీవ దహనం
పటాకుల తయారీ ఫ్యాక్టరీలో శుక్రవారం ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో వ్యక్తి సజీవ దహనమయ్యాడు

- తమిళనాడులో ఘటన
విధాత: పటాకుల తయారీ ఫ్యాక్టరీలో శుక్రవారం ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని షణ్ముగరాజు (38)గా గుర్తించారు. ఈ ఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలో చోటుచేసుకున్నది. అగ్నిమాపక, రెస్క్యూ డిపార్ట్‌మెంట్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఫ్యాక్టరీలో షణ్ముగరాజు క్రాకర్స్ తయారు చేయడానికి రసాయనాలను నింపుతుండగా ప్రమాదవత్తు అందిపేలి ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. భారతదేశంలో పటాకుల హబ్‌గా పిలువబడే విరుదునగర్ జిల్లాలోని శివకాశిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 6.5 లక్షలకు పైగా కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి.
గత 2 నెలల్లో తమిళనాడులో ఇలాంటి పేలుడు ఘటన నమోదు కావడం ఇది రెండోసారి. అక్టోబర్‌లో అరియలూర్‌లోని బాణాసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో తొమ్మిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.