Warangal: ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

ఓసిటి కేంద్రంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురి అరెస్టు 3ల్యాప్‌టాప్‌లు, 13సెల్‌ఫోన్లు, రూ.1.90ల‌క్ష న‌గ‌దు.. ఒక ద్విచ‌క్ర వాహ‌నం, డెబిట్‌, క్రెడిట్ కార్డులు, చెక్‌బుక్కులు స్వాధీనం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరంలోని ఓసిటి కేంద్రంగా ఆన్ లైన్ గేమ్స్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు యువతులతో సహా ఆరుగురి ముఠా సభ్యులను మిల్స్ కాలనీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరినుండి సుమారు పది లక్షల విలువగల మూడు ల్యాప్ టాప్లు, పదమూడు సెల్‌ఫోన్లు, ఒక […]

Warangal:  ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్‌ ముఠా అరెస్టు
  • ఓసిటి కేంద్రంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురి అరెస్టు
  • 3ల్యాప్‌టాప్‌లు, 13సెల్‌ఫోన్లు, రూ.1.90ల‌క్ష న‌గ‌దు..
  • ఒక ద్విచ‌క్ర వాహ‌నం, డెబిట్‌, క్రెడిట్ కార్డులు, చెక్‌బుక్కులు స్వాధీనం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరంలోని ఓసిటి కేంద్రంగా ఆన్ లైన్ గేమ్స్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు యువతులతో సహా ఆరుగురి ముఠా సభ్యులను మిల్స్ కాలనీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరినుండి సుమారు పది లక్షల విలువగల మూడు ల్యాప్ టాప్లు, పదమూడు సెల్‌ఫోన్లు, ఒక లక్ష 90వేల రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం, బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి అబ్దుల్ బారీ వివరించారు. ఛత్తీస్ ఘడ్ రాయచూర్ ప్రాంతానికి చెందిన పఠాన్బాబ(23), పటాన్ ఖాసీం ఖాన్ (28), ఓడిషాకు చెందిన చాందిన
నాగ్ (27)తో పాటు సయ్యద్ సల్మాబేగ్ (26), ఖమ్మంకు చెందిన మొగల్ మున్న (19), గుంజ కళ్యాన్ (20) వీరందరూ ఓ ముఠాగా ఏర్పడి ఆన్‌లైన్ గేమ్స్ బెట్టింగ్ కు పాల్పడుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ముఠాను పట్టుకోవడంఓ ప్రతిభ కనబరిచిన వరంగల్ ఏసిపి బోనాల కిషన్, ఇన్స్‌స్పెక్టర్లు ముస్కా శ్రీనివాస్, జనార్ధన్ రెడ్డి, ఏఏఓ ప్రశాంత్, ఎస్ఐ కుమార్, ఏఎస్.ఐ. స్వరూప, కానిస్టేబుళ్ళు భౌసింగ్, వీరన్న, హెంగార్డ్ నాగేశ్వర్రావును డిసిపి అభినందించారు.