Tharun Chug: కేసులను తప్పుదోవ పట్టించడంలో KCRకు ఆస్కార్ అవార్డు: తరుణ్‌చుగ్
లిక్కర్ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం కెసిఆర్ పాలనకు త్వరలో బైబై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ విమర్శ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) లిక్కర్ స్కాం (Liquor scam)పై ఈడి (ED) విచారణ (investigation)చేస్తుంటే తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని బీజేపీ (BJP) రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ చుగ్ (Tarun Chug) విమర్శించారు. లిక్కర్ స్కాంలో విచారణ కోసం పిలిస్తే ఆ […]

- లిక్కర్ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం
- కెసిఆర్ పాలనకు త్వరలో బైబై
- బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ విమర్శ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) లిక్కర్ స్కాం (Liquor scam)పై ఈడి (ED) విచారణ (investigation)చేస్తుంటే తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని బీజేపీ (BJP) రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ చుగ్ (Tarun Chug) విమర్శించారు. లిక్కర్ స్కాంలో విచారణ కోసం పిలిస్తే ఆ విచారణ సంస్థలపై సీఎం కేసీఆర్ (CM KCR) ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
లోక్ సభ ప్రవాస్ యోజనలో భాగంగా వరంగల్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి కోర్ కమిటీ సభ్యుల సమావేశానికి ఆదివారం తరుణ్ చుగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్‌లో తరుణ్ చుగ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడం అయిపోయింది… ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి ఢిల్లీకి బయలు దేరారని ఎద్దేవా చేశారు. మోసం చేసిన వాళ్లను ప్రశ్నిస్తే తప్పుదారి పట్టించడంలో కేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇయ్యొచ్చన్నారు.
స్మార్ట్ సిటీ కోసం కేంద్రం నిధులిస్తుంటే.. కేసీఆర్ సర్కారు నిధులను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. కేసీఆర్ సర్కారు తెలంగాణను లూటీ చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాదు.. అలీబాబా నలభై దొంగల సర్కారంటూ దోచేయ్.. దాచెయ్ అన్నట్లుగా ఉంది కేసీఆర్ పాలన అని చుగ్ విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ చేతిలో తోలుబొమ్మలా మారిందని, కేసీఆర్ కు బైబై చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించబోతున్నారని భరోసా వ్యక్తం చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా పోచమ్మ మైదాన్ సెంటర్‌లోని రాణి రుద్రమ దేవి విగ్రహానికి తరుణ్ చుగ్, బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం సమావేశంలో వరంగల్ లోక్‌సభ పరిధిలోని సానుకూల ప్రతికూల పరిస్థితులను చర్చించారు. సమావేశంలో బిజెపి వరంగల్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ రావు, పద్మ వన్నాల, శ్రీరాములు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ప్రేమేందర్ రెడ్డి, కుసుమ సతీష్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.