అక్టోబ‌ర్ మొద‌టి వారంలో వినోదాల విందు.. ఓటీటీలో తెగ సంద‌డి చేయ‌నున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

  • By: sn    latest    Oct 02, 2023 3:49 PM IST
అక్టోబ‌ర్ మొద‌టి వారంలో వినోదాల విందు.. ఓటీటీలో తెగ సంద‌డి చేయ‌నున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

థియేట‌ర్‌లో ప‌లు సినిమాలు సంద‌డి చేస్తున్నా కూడా ఓటీటీలోని ప్ర‌తి వారం వ‌చ్చే వెబ్ సిరీస్‌లు, సినిమాల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప‌లు ఓటీటీ సంస్థ‌లు ఆడియ‌న్స్‌ని అట్రాక్ట్ చేసేందుకు భారీగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ చేస్తున్నారు.


మార్కెట్‌కి త‌గ్గ‌ట్టుగా వివిధ వెర్షన్‌లలో సినిమాలను రిలీజ్‌ చేస్తూ ఓటీటీ ఆడియెన్స్‌ను అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జియో సినిమా, ఆహా… ఇలా అన్ని రకాల ఓటీటీల‌లో వైవిధ్య‌మైన వినోదం ద‌క్క‌నుంది. అక్టోబ‌ర్ లో వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తే..

నెట్‌ ఫ్లిక్స్‌లో ఖుషి – అక్టోబర్ 1 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. బెచ్‌కమ్‌ – అక్టోబర్ 4, రేస్‌ టు సమ్మిట్‌ – అక్టోబర్ 4, మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి- అక్టోబర్ 5, ఖుఫియా – అక్టోబర్ 5, లుపిన్‌, పార్ట్‌ 3 – అక్టోబర్ 5, బాలెరినా – అక్టోబర్ 6, సాండర్డ్‌ విత్‌ మై మదర్‌ ఇన్‌ లా (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్ 9, వన్స్‌ అపాన్‌ ఎ స్టార్‌ – అక్టోబర్ 11, బిగ్‌ వేప్‌: ద రైస్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ జూల్‌ (డాక్యుమెంటరీ) – అక్టోబర్ 11, ద ఫాల్‌ ఆఫ్‌ ద హౌస్‌ ఆఫ్‌ ఉషర్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్ 12, గుడ్‌ నైట్‌ వరల్డ్‌ (యానిమేషన్‌) – అక్టోబర్ 12, ఫెయిర్‌ ప్లే – అక్టోబర్ 13, పాస్ట్‌ లైవ్స్‌ – అక్టోబర్ 13, ద కాన్‌ఫరెన్స్‌ – అక్టోబర్ 13, ఓగీ ఓగీ (3వ సీజన్‌) – అక్టోబర్ 16, ద డెవిల్‌ ఆన్‌ ట్రయల్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్ 17, కాలా పాని (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్ 18, బాడీస్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 19, క్రిప్టో బాయ్‌ – అక్టోబర్ 19, ఓల్డ్‌ డాడ్స్‌ – అక్టోబర్ 20, లైఫ్‌ ఆన్‌ అవర్‌ ప్లానెట్‌ (డాక్యు సిరీస్‌) – అక్టోబర్‌ 25, బర్నింగ్‌ బీట్రేయల్‌ – అక్టోబర్ 25, ప్లూటో (యానిమేషన్‌) – అక్టోబర్ 26, ఎల్లో డోర్‌: 90’s లో-ఫి ఫిలిం క్లబ్‌ (డాక్యుమెంటరీ) – అక్టోబర్ 27, పెయిన్‌ హస్లర్స్‌ – అక్టోబర్ 27, సిస్టర్‌ డెత్‌ – అక్టోబర్ 27, టోర్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్ 27, కాస్తవే దివా – అక్టోబర్ 28, రాల్ఫ్‌ బార్బోసా: కోవాబుంగ – అక్టోబర్ 31 న స్ట్రీమంగ్ కానున్నాయి.

ఇక జియో సినిమాలో చూస్తే.. బెబాక్‌ (హిందీ మూవీ) – అక్టోబర్ 1 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. లయన్స్‌ గేట్‌ ప్లేలో జాయ్‌ రైడ్‌ – అక్టోబర్ 6, మింక్స్‌ ( రెండో సీజన్‌) – అక్టోబర్ 6, మ్యాగీ మూర్స్‌ – అక్టోబర్ 20, కబ్‌వెబ్‌ – అక్టోబర్ 27న స్ట్రీమింగ్ కానున్నాయి.


డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ లో హాంటెడ్‌ మిషన్‌ – అక్టోబర్ 4, లోకి సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభం, ఇంఫీరియర్‌ డెకొరేటర్‌ – అక్టోబర్ 6, సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్ 13, వన్స్‌ అపాన్‌ ఎ స్టూడియో (షార్ట్‌ ఫిల్మ్‌) – అక్టోబర్ 16, మాస్టర్‌పీస్‌ – అక్టోబర్ 25న స్ట్రీమింగ్ కానున్నాయి.


అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ – అక్టోబర్ 6, ముంబై డైరీస్‌ (రెండో సీజన్‌) – అక్టోబర్ 6, టోటల్లీ కిల్లర్‌ – అక్టోబర్ 6, మిషన్‌ ఇంపాజిబుల్‌- డెడ్‌ రెకనింగ్‌ పార్ట్‌ 1 – అక్టోబర్ 11, అప్‌లోడ్‌ (మూడో సీజన్‌) – అక్టోబర్ 20న స్ట్రీమింగ్ జ‌ర‌గ‌నున్నాయి.