విధాత: ప‌్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతమైనదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. మీరు మారాష్ట్రం కోసం, మా ప్రజల కోసం చేసే ఏమంచి పనైనా ఈ ప్రజానీకం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని న్నారు. తమకు మా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, మరో ఎజెండా లేదని స్పష్టం చేశారు.
మీరు పెద్ద మనసు చూపి, మంచి పనులు చేపడితే వాటిని ఎల్లప్పుడూ గుర్తు పెట్టకుంటామని మరోసారి జగన్ తెలిపారు. విభజన హామీలతో పాటు పోలవరం ప్రాజెక్టకు ప్రత్యేక హోదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ, రైల్వే జోన్ ఏర్పాటు వరకు పలు అంశాలపై తాము చేసిన
కేంద్ర ప్రభుత్వంతో, ప్రత్యేకంగా మోదీ గారితో మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం.#CMYSJagan #PMModiTourVisakha pic.twitter.com/J3JPD5dH1D
— YSR Congress Party (@YSRCParty) November 12, 2022
విజ్ఞప్తులను మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని వాటన్నింటిని పరిష్కరించాలని ప్రధాని మోడీని జగన్ కోరారు. మంచి పనులు చేస్తున్న తమ ప్రభుత్వానికిదేవుడి దయ, ప్రజలందరిచల్లని దీవెనలు, పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడు తమకు లభించాలని జగన్ కోరారు.