Manipur | దేశంలోకి 718 మంది మ‌య‌న్మార్ జాతీయులు

Manipur రెండు రోజుల్లోనే మ‌ణిపూర్ ద్వారా ప్ర‌వేశం విధాత‌: ఒక రొట్టె కోసం రెండు కోతులు కొట్లాడుకుంటే న‌క్కకు విందు అయిన‌ట్టు.. మ‌ణిపూర్ ఘ‌ర్ష‌ణ‌లు మ‌య‌న్మార్ జాతీయుల‌కు సందుగా మారాయి. గ‌డిచిన రెండు రోజుల్లో 718 మంది మయన్మార్ జాతీయులు మణిపూర్‌లోకి ప్ర‌వేశించిన‌ట్టు ఒక ప్ర‌భుత్వ నివేదిక వెల్ల‌డించింది. జూలై 22, 23 తేదీల్లో 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు సహా 718 మంది మయన్మార్ జాతీయులు మణిపూర్‌లోకి ప్రవేశించారని ప్ర‌క‌టించింది. సరైన ప్రయాణ […]

Manipur | దేశంలోకి 718 మంది మ‌య‌న్మార్ జాతీయులు

Manipur

  • రెండు రోజుల్లోనే మ‌ణిపూర్ ద్వారా ప్ర‌వేశం

విధాత‌: ఒక రొట్టె కోసం రెండు కోతులు కొట్లాడుకుంటే న‌క్కకు విందు అయిన‌ట్టు.. మ‌ణిపూర్ ఘ‌ర్ష‌ణ‌లు మ‌య‌న్మార్ జాతీయుల‌కు సందుగా మారాయి. గ‌డిచిన రెండు రోజుల్లో 718 మంది మయన్మార్ జాతీయులు మణిపూర్‌లోకి ప్ర‌వేశించిన‌ట్టు ఒక ప్ర‌భుత్వ నివేదిక వెల్ల‌డించింది.

జూలై 22, 23 తేదీల్లో 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు సహా 718 మంది మయన్మార్ జాతీయులు మణిపూర్‌లోకి ప్రవేశించారని ప్ర‌క‌టించింది. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్ జాతీయులను భారతదేశంలోకి ఎలా అనుమతించార‌నే అంశంపై వివరణాత్మక నివేదిక అందించాల‌ని అస్సాం రైఫిల్స్ నుంచి మణిపూర్ ప్రభుత్వం కోరింది.

చెల్లుబాటు అయ్యే వీసా/ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్ పౌరులు మణిపూర్‌లోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌కు గ‌తంలో స్పష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింద‌ని మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి గుర్తుచేశారు. ఈ మేర‌కు సోమ‌వారం రాత్రి సీఎస్‌ జోషి మ‌రోసారి అస్సాం రైఫిల్స్‌ను ఆదేశించారు.

ఖంపత్ వద్ద జరుగుతున్న ఘర్షణల కారణంగా రెండు రోజుల్లోనే 718 మంది శరణార్థులు ఇండో-మయన్మార్ సరిహద్దును దాటి చందేల్ జిల్లా గుండా మణిపూర్‌లోకి ప్రవేశించారని అస్సాం రైఫిల్స్ చందేల్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు సమాచారం అందించింది. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక అందించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. మ‌ణిపూర్‌లో రెండు తెగ‌ల మ‌ధ్య త‌లెత్తిన ఘ‌ర్ష‌ణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 160 మంది వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు.