Pawan Kalyan | పవన్ తేల్చేశారు.. మరి ఆలపాటి గతేం కావాలి..
Pawan Kalyan విధాత: పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు టిడిపికి ఇబ్బందికరంగా మారింది. గోదావరి జిల్లాల్లో తన యాత్ర సక్సెస్ అయిన కాన్ఫిడెన్స్ కావచ్చు.. తన కుడి భుజం నాదెండ్ల మనోహర్ కు తాను ఇస్తున్న ప్రాధాన్యం కావచ్చు.. కానీ తాను ఇప్పుడు ఏకంగా సింగిల్ గా తీసుకున్న నిర్ణయం టిడిపికి ఇరుకున పడేసింది. దీనిమీద చంద్రబాబు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కంటే ముందుగానే జనసేన […]

Pawan Kalyan
విధాత: పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు టిడిపికి ఇబ్బందికరంగా మారింది. గోదావరి జిల్లాల్లో తన యాత్ర సక్సెస్ అయిన కాన్ఫిడెన్స్ కావచ్చు.. తన కుడి భుజం నాదెండ్ల మనోహర్ కు తాను ఇస్తున్న ప్రాధాన్యం కావచ్చు.. కానీ తాను ఇప్పుడు ఏకంగా సింగిల్ గా తీసుకున్న నిర్ణయం టిడిపికి ఇరుకున పడేసింది. దీనిమీద చంద్రబాబు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కంటే ముందుగానే జనసేన తన తొలి అభ్యర్ధిని ప్రకటించింది. జనసేనాని పవన్ కి వెన్ను దన్నుగా ఉన్న రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను తెనాలి నుంచి పోటీకి దించుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.
నిజానికి ఇక్కడి నుంచి టిడిపి తరఫున మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉన్నారు. గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజా మొన్నటి 2019 ఎన్నికల్లో డెబ్భై వేల ఓట్లు తెచ్చికోగా జనసేన నుంచి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ కి పాతిక వేల లోపు ఓట్లు వచ్చాయి.
అయితే వైసిపి నుంచి అన్నా బత్తుని శివకుమార్ ఇక్కడ గెలిచారు. ఈసారి జనసేనతో పొత్తు ఉన్నా ఆలపాటి రాజా ఇక్కడి నుంచి పోటీ చేస్తారు అని టాక్ ఉండేది. అయితే పవన్ ఈ పొత్తుల కంటే ముందుగానే తమ అభ్యర్ధిని ప్రకటించేశారు. నాదెండ్ల మనోహర్ మంచి అభ్యర్ధి అని ఈసారి ఆయన గెలిస్తే తెనాలి లో అభివృద్ధి అద్భుతంగా సాగుతుందని పవన్ హామీ కూడా ఇచ్చారు. దీనిమీద టిడిపి ఇంకా ఆలపాటి రాజా ఎలా స్పందిస్తారో చూడాలి.