Pawan Kalyan
విధాత: గత వారం గోదావరి జిల్లాలో బస్సు యాత్రలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లు మీద చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఇప్పుడు చిక్కుల్లో పడేసేలా ఉన్నాయి. ఆయన మీద ప్రభుత్వం కేసు బుక్ చేసి కోర్టుకు లాగాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కోర్టులో కేసు వేసింది. వాలంటీర్లు మహిళా ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నట్లు .. రాష్ట్రంలో వేలమంది మహిళలు, యువతులు అదృశ్యం అయినట్లు పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని లేపాయి. అంతేకాకుండా జగన్ మీద కూడా పవన్ పలు వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు.
పవన్ సీఎం జగన్ ను ఏకంగా రౌడీ అంటూ జగ్గు భాయ్ అని కామెంట్ చేశారు. జగన్ అంటూ ఏక వచన సంభోదన చేశారు. ఇవన్నీ పవన్ చేసిన అత్యుత్సాహం, ఓవర్ యాక్షన్ అని ప్రభుత్వం భావిస్తోంది. జగనూ..జైలూ..కుడు పెంచిన పవన్ ఇక ఇటీవల కొత్త సభా సంఘాన్ని కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం నియమించారు.
సభా సంఘం ప్రభుత్వంలో ఉన్న వారి మీద ఎవరైనా దారుణమైన ఆరోపణలు చేస్తే వారికి నోటీసులు ఇచ్చి పిలిపించి విచారిస్తుంది. అలా పవన్ సీఎం జగన్ మీద ఏకవచన ప్రయోగంతో చేసిన దారుణ కామెంట్స్ మీద చేయాలని కూడా వైసీపీలో చర్చ నడిచింది అంటున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే పవన్ కు ఏపి మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. వాలంటీర్లు అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ మహిళా కమిషన్ ఇదివరకే నోటీసులు ఇచ్చింది. తాజాగా ఆయన్ను కోర్టుకు లాగేందుకు నిర్ణయించుకుని ఏకంగా కేసు బుక్ చేసి కోర్టుకు లాగుతున్నట్లు తెలుస్తోంది.