విధాత: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఇవాళ రాత్రికి వచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోదీతో భేటీ అయ్యారు. రాత్రి 8:30 గంటలకు మోదీ బస చేసిన హోటల్లో పవన్‌తో పాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా భేటీ అయ్యారు.
ప్రధానితో భేటీ అనంతరం పవన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని మోదీని కలిశానని అన్నారు. రెండు రోజులు క్రితం పీఎంవో ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని ఏపీ బాగుండాలని ప్రధాని ఆకాంక్షించారని పవన్ తెలిపారు. ఏపీలోని పరిస్థితులు అన్నీ ప్రధాని అడిగి తెలుసుకున్నారని తెలిపారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కునేందుకు బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు పలికిన విషయం తెలిసిందే.