Padma Rao Goud | బీఆర్ఎస్‌ను ప్రజలు మరోసారి ఆదరిస్తారు: పద్మారావు గౌడ్

డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ Padma Rao Goud | విధాత, సికింద్రాబాద్: కేసీఆర్ నాయకత్వంలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగించామని, మరోసారి బీఆర్ఎస్ ను ఆదరిస్తారని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అడ్డగుట్టలో రూ.1.39 కోట్ల ఖర్చుతో వివిధ అభివృద్ధి పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, బీఆర్ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, అధికారులు, […]

  • By: Somu    latest    Aug 22, 2023 12:54 PM IST
Padma Rao Goud | బీఆర్ఎస్‌ను ప్రజలు మరోసారి ఆదరిస్తారు: పద్మారావు గౌడ్
  • డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

Padma Rao Goud |

విధాత, సికింద్రాబాద్: కేసీఆర్ నాయకత్వంలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగించామని, మరోసారి బీఆర్ఎస్ ను ఆదరిస్తారని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అడ్డగుట్టలో రూ.1.39 కోట్ల ఖర్చుతో వివిధ అభివృద్ధి పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు.

అనంతరం కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, బీఆర్ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, అధికారులు, నాయకులతో కలిసి అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.

వడ్డెర బస్తీ, ఆజాద్ చంద్ర శేఖర్ నగర్, బీ సెక్షన్, శాస్త్రి నగర్, తుకారాం గేట్, లోహియా నగర్, కొండా రెడ్డి నగర్ ప్రాంతాల్లో సివర్ లైన్లు, మంచినీటి పైప్ లైన్లు, రోడ్ల నిర్మాణం పనులు, లోహియా నగర్ సమీపంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజ శేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు దీపికలతో కలిసి సివరేజ్ లైన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. అడ్డగుట్టకు కొత్తగా రూ.13.05 కోట్లతో 30 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు.