ఓనర్‌ను కాటేసిన పెంపుడు పాము.. విలవిలలాడిన మహిళ

విధాత: మెడకు చుట్టుకున్న పాము కరవక మానుతుందా.. ఈ సామెత ఈ వీడియోకి నూటికి నూరు శాతం సూట్ అవుతుంది. ఐతే కొందరు ఇష్టంగా కుక్కలను పెంచుకుంటారు.. ఇంకొందరైతే పిల్లులను పెంచుకుంటారు.. అలా తమకు ఇష్టమైన జంతువులను పెంచుకుంటారు.. కానీ ఓ మహిళా తన ఇంట్లోనే పామును పెంచుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఆ సర్పానికి ఆలానా పాలనా చూసుకుంటున్న క్రమంలో ఓ రోజు హఠాత్తుగా కాటేసింది.. పామును భద్రపరిచిన గాజు గ్లాస్ క్యాప్ తీసుండగా.. […]

  • By: krs    latest    Oct 26, 2022 3:07 AM IST
ఓనర్‌ను కాటేసిన పెంపుడు పాము.. విలవిలలాడిన మహిళ

విధాత: మెడకు చుట్టుకున్న పాము కరవక మానుతుందా.. ఈ సామెత ఈ వీడియోకి నూటికి నూరు శాతం సూట్ అవుతుంది. ఐతే కొందరు ఇష్టంగా కుక్కలను పెంచుకుంటారు.. ఇంకొందరైతే పిల్లులను పెంచుకుంటారు.. అలా తమకు ఇష్టమైన జంతువులను పెంచుకుంటారు..

కానీ ఓ మహిళా తన ఇంట్లోనే పామును పెంచుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఆ సర్పానికి ఆలానా పాలనా చూసుకుంటున్న క్రమంలో ఓ రోజు హఠాత్తుగా కాటేసింది.. పామును భద్రపరిచిన గాజు గ్లాస్ క్యాప్ తీసుండగా.. బుసలు కొడుతూ ఆమె చేతికి క్షణాల్లో కాటేసి చుట్టుకుంది..

చేతికి చుట్టుకున్న పామును విడిపించేందుకు మరొకరు ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది .. ఆ సర్పం మోచేతి వరకు చుట్టుకోవడంతో బాధిత మహిళా విలవిలలాడింది. త్రీవ రక్తస్రావం అయింది. ఇది పాత వీడియో అయినప్పటికీ ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. ప్రస్తుతం వైరల్ అవుతుంది.